ప్రభుత్వ వైద్యుడి హైటెక్ చీటింగ్ .. కృత్రిమ వేలితో హాజరు, సస్పెండ్ చేసిన విడదల రజనీ

By Siva KodatiFirst Published Sep 4, 2022, 3:54 PM IST
Highlights

ప్రభుత్వ ఆసుపత్రికి రాకుండా బయోమెట్రిక్ హాజరును తప్పించుకునేందుకు కృత్రిమ వేలు తయారు చేయించాడో వైద్యుడు. విషయం తెలుసుకున్న ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ అతనిని సస్పెండ్ చేశారు. 

టెక్నాలజీ రాకతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. దీనిని అడ్డుపెట్టుకుని నేరాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో హాజరు కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ వేసేందుకు కృత్రిమంగా వేలు తయారు చేయించుకుని హాజరు వేస్తున్న డాక్టర్‌ను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం గుంటుపల్లి పీహెచ్‌సీలో పనిచేస్తున్నారు డాక్టర్ భానుప్రకాశ్. ఈ క్రమంలో శనివారం ఈ హెల్త్ సెంటర్‌ను మంత్రి రజిని సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడుతుండగా భాను ప్రకాశ్ బాగోతం బయటపడింది. 

ALso Read:దారుణం : డాక్టర్ల కోసం ఎదురుచూపులు, చివరికి తల్లి చేతుల్లోనే ప్రాణం వదిలిన చిన్నారి

ఆయనకు మార్టూరులో సొంతంగా క్లినిక్ వుంది. నిత్యం అక్కడ బిజీగా వుండే ఆయన.. ఓ కృత్రిమ వేలిని తయారు చేయించి దానిని అక్కడి సిబ్బందికి ఇచ్చారు. దీని ద్వారా మూడు పూటలా హాజరు వేయించుకుంటూ ఇటు ప్రభుత్వ ఉద్యోగం, అటు తన క్లినిక్‌ని నడుపుకుంటూ హాయిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో మంత్రి విడదల రజినీకి విషయం చెప్పారు గ్రామస్తులు. బయోమెట్రిక్ ఒక్కటే కాకుండా డాక్టర్ భాను ప్రకాశ్ అక్కడి సిబ్బందితో కలిసి మద్యం తాగేవారని, మహిళా సిబ్బందితో సైతం అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వుంటారని తెలిపారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. అక్కడికక్కడే భానుప్రకాశ్‌ను సస్పెండ్ చేశారు. అలాగే ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రజినీ అధికారులను ఆదేశించారు. 
 

click me!