ట్యూషన్ కోసం వచ్చిన బాలికను గర్భవతిని చేసిన మాస్టారు..!

Published : Sep 23, 2021, 07:23 AM IST
ట్యూషన్ కోసం వచ్చిన బాలికను గర్భవతిని చేసిన మాస్టారు..!

సారాంశం

మిగిలిన విద్యార్థులంతా వెళ్లిపోయాక.. నీకు తెలివి లేదు.. మేథాశక్తి పెంచుతాను.. నీకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి అంటూ బాలికను లోబరుచుకున్నాడు. 

తన దగ్గర చదువు నేర్చుకోవడానికి వచ్చిన బాలికపై  ఉపాధ్యాయుడు కన్నేశాడు. చదువు చెప్పాల్సిందిపోయి.. బాలికను గర్భవతిని చేశాడు. ఈ సంఘటన విజయనగరంలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే...  విజయనగరం జిల్లా గంట్యాడ మండలానికి చెందిన పదో తరగతి విద్యార్థిని(16) మూడేళ్ల నుంచి   ఓ ట్యూషన్ సెంటర్ కి వెళ్తోంది. కాగా.. ఆమెకు చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు ఆమెపై కన్నేయడం గమనార్హం.

మిగిలిన విద్యార్థులంతా వెళ్లిపోయాక.. నీకు తెలివి లేదు.. మేథాశక్తి పెంచుతాను.. నీకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి అంటూ బాలికను లోబరుచుకున్నాడు. కొన్ని రోజులుగా బాలిక సరిగా తినకపోవడం, నీరసంగా ఉండటంతో ఆమెను తల్లిదండ్రులు ఆష్పత్రికి తీసుకువెళ్లారు. కాగా.. వైద్యులు పరిశీలించి బాలిక గర్భవతి అని చెప్పారు. 

అప్పటికే బాలికకు ఎనిమిది నెలలు రావడం గమనార్హం. వెంటనే బాధితులు దిశ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు. నిందితుడు చిన్నాను అదుపులోకి తీసుకున్నామని దిశ డీఎస్పీ త్రినాథ్ తెలిపారు. నిందితుడికి అప్పటికే పెళ్లైంది. భార్య కూడా ఉంది. కాగా.. ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో ట్యూషన్లు చెప్పుుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో బాలికపై కన్నేసి గర్భవతిని చేయడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu
CM Chandrababu: నిధులు లేవని ప్రాజెక్ట్స్ నిలపకండి అధికారులకు సీఎం ఆదేశాలు | Asianet News Telugu