యువతితో సహజీవనం.. దూరం పెట్టిందని..!

Published : Sep 23, 2021, 08:20 AM IST
యువతితో సహజీవనం.. దూరం పెట్టిందని..!

సారాంశం

సుమారు ఐదు నెలల కిందట సురేష్ ప్రభు నిర్వహించే డెయిరీలో ఆమె పనికి చేరింది. ఈ క్రమంలో ప్రభుతో.. వివాహేతర సంబంధం ఏర్పడింది.

అతను ఓ యువతిని చాలా కాలంగా ప్రేమిస్తున్నాడు. ఆమె తో కలిసి సహజీవనం కూడా చేశాడు. అయితే.. తనతో సహజీవనం చేసిన యువతి తనను దూరం పెట్టడం మొదలుపెట్టింది. దీంతో.. దానికి కారణమయ్యాడనే కోపంతో.. ఓ వ్యక్తిని అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన జంగారరెడ్డిగూడెంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇటీవల జంగారెడ్డిలోని డెయిరీ యజమాని కందుకూరి సురేష్ ప్రభు(47) దారుణ హత్యకు గురయ్యాడు.  కాగా.. అతని హత్య కేసు విషయంలో పోలీసులకు నమ్మసక్యం కాని నిజాలు వెలుగు చూశాయి.  ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఓలేటి చిరంజీవి, అతని సోదరుడు ఓలేటి రాజు అలియాస్ చమ్మరాజు, తండ్రి ఓలేటి ఈశ్వరరావులుగా గుర్తించారు, కాగా.. ప్రధాన నిందితుడు చిరంజీవి పరారీలో ఉన్నాడు. సురేష్ ప్రభు ని.. చిరంజీవి చంపడానికి గల కారణం.. ప్రేమ కావడం గమనార్హం,

యానాంకు చెందిన చిరంజీవి కుటుంబం కొన్నేళ్లుగా కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి వద్ద నివాసం ఉంటున్నారు. చిరంజీవితో పట్టణానికి చెందిన ఉరదండి ఆశాజ్యోతి రెండు సంవత్సరాల కిందట సహజీవనం చేసింది. సుమారు ఐదు నెలల కిందట సురేష్ ప్రభు నిర్వహించే డెయిరీలో ఆమె పనికి చేరింది. ఈ క్రమంలో ప్రభుతో.. వివాహేతర సంబంధం ఏర్పడింది.

ప్రభుతో బంధం ఏర్పడిన దగ్గర నుంచి... చిరంజీవి ని దూరం పెట్టడం మొదలుపెట్టింది. తన ప్రేయసి తనకు దూరం కావడానికి ఆ ప్రభునే కారణమని కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో పథకం ప్రకారం.. ఇటీవల తన సోదరుడు, తండ్రి సహాయంతో కత్తితో నరికి మరీ హత్య చేశాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Warning at NTR District | “మీ ఉద్యోగం పోతుంది చూసుకోండి” | Asianet News Telugu
IMD Rain Alert : శ్రీలంక సమీపంలో ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు