కరోనా : ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కన్నుమూత

By narsimha lodeFirst Published Jan 1, 2021, 10:08 AM IST
Highlights

ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి శుక్రవారం నాడు ఉదయం హైద్రాబాద్ లో కన్నుమూశారు. కరోనాతో ఆయన హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి శుక్రవారం నాడు ఉదయం హైద్రాబాద్ లో కన్నుమూశారు. కరోనాతో ఆయన హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.గత నెల 13వ తేదీన ఆయన కరోనా చికిత్స కోసం  ఆసుపత్రిలో చేరారు.

.గత నెల 5వ తేదీన ఆయనకు కరోనా లక్షణాలు కన్పించాయి. వెంటనే ఆయన పరీక్షలు చేయించుకొన్నాడు.ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టుగా తేలింది. దీంతో ఆయన గత నెల 13వ తేదీన హైద్రాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు.

 

ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి శుక్రవారం నాడు ఉదయం హైద్రాబాద్ లో కన్నుమూశారు. కరోనాతో ఆయన హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.గత నెల 13వ తేదీన ఆయన కరోనా చికిత్స కోసం ఆయన ఆసుపత్రిలో చేరారు. pic.twitter.com/1rkzS1Gsoc

— Asianetnews Telugu (@AsianetNewsTL)

  గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.  శుక్రవారం నాడు ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

2014 ఎన్నికలకు ముందు వరకు  ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరాడు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చల్లా రామకృష్ణారెడ్డికి  కార్పోరేషన్ పదవిని ఇచ్చారు.ఈ పదవి విషయంలో చల్లా రామకృష్ణారెడ్డి తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. 2019 మార్చి 4న చల్లా రామకృష్ణారెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. అదే ఏడాది  మార్చి 18న ఆయన వైసీపీలో చేరాడు. 

1948 ఆగష్టు 27వ తేదీన ఆయన జన్మించారు. వ్యవసాయంపై ఆయనకు మక్కువ. బీఎస్సీ  అగ్రికల్చర్  చదివాడు. వ్యవసాయంలో ఆయన చేసిన కృషికి గాను ఆయనకు కృషి పండిత్ అవార్డు కూడా దక్కింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాలోని పాణ్యం, కౌకుంట్ల అసెంబ్లీ స్థానాల నుండి  మూడు దఫాలు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రామకృష్ణారెడ్డికి భార్య ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

టీడీపీ ద్వారా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 1983లో ఆయన టీడీపీలో చేరాడు. పాణ్యం అసెంబ్లీ స్థానం నుండి ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించాడు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 1999, 2004 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా కోవెలకుంట్ల స్థానం నుండి గెలుపొందారు. 

2019 లో ఆయన వైఎస్ఆర్‌సీలో చేరారు. ఇటీవలనే ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం వైఎస్ఆర్‌పీ ఎమ్మెల్సీగా ఉన్నారు.

click me!