వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తల్లి కన్నుమూత

By Siva KodatiFirst Published Aug 21, 2022, 9:04 PM IST
Highlights

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి మంగారత్నం అనారోగ్యంతో కన్నుమూశారు. గతకొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోన్న ఆమె ఆరోగ్యం ఆదివారం క్షీణించడంతో మంగారత్నం తుదిశ్వాస విడిచారు. 

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి మంగారత్నం అనారోగ్యంతో కన్నుమూశారు. గతకొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోన్న ఆమె ఆరోగ్యం ఆదివారం క్షీణించడంతో మంగారత్నం తుదిశ్వాస విడిచారు. డ్రైవర్ సుబ్రమణ్యాన్ని హత్య చేసిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో వున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ఇకపోతే.. ఈ ఏడాది మే 20వ తేదీన ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద డ్రైవర్ గా పనిచేసి మానేసిన సుబ్రమణ్యం హత్యకు గురయ్యారు. ఈ హత్యకు ఎమ్మెల్సీ అనంతబాబు కారణమని పోలీసులు తేల్చారు.  సుబ్రమణ్యాన్ని పద్దతి మార్చుకోవాలని మందలించే క్రమంలో  చేయి చేసకోవడంతో అతను కింద పడి తలకు గాయం కావడంతో మరణించినట్టుగా వైద్యులు తెలిపారు. అయితే ఈ కేసులో దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడంతో పోలీసులు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారు.

ALso Read:ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ ఈ నెల 26 వరకు పొడిగింపు: జైలుకు తరలింపు

ఈ కేసులో అరెస్టైన అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నాడు. బెయిల్ మంజూరు చేయాలని ఆయన గతంలో కోర్టుల్లో బెయిల్ పిటిసన్లు దాఖలు చేశారు. అయితే అనంతబాబు బెయిల్ పిటిషన్లను కోర్టులు పలుమార్లు కొట్టివేశాయి. ఇదిలా ఉంటే  ఈ కేసులో పోలీసులు చార్జీషీట్ దాఖలు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. 90 రోజుల్లోపుగా చార్జీషీట్ దాఖలు చేయకపోతే బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. 

మరోవైపు.. డ్రైవర్ సుబ్రమణ్యం భార్య అపర్ణకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది.  వైద్య ఆరోగ్య శాఖలో అపర్ణకు జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం ఇచ్చింది ప్రభుత్వం.ఈ మేరకు కలెక్టర్ కృతికా శుక్లా ఈ ఏడాది జూన్ చివర్లో ఉత్తర్వు పత్రాలను అందించారు. 

click me!