తెలిసే ప్రేమించి పెళ్లాడాడు: భర్త కోసం థర్డ్ జెండర్ పోరు

Published : Oct 17, 2018, 03:48 PM IST
తెలిసే ప్రేమించి పెళ్లాడాడు: భర్త కోసం థర్డ్ జెండర్ పోరు

సారాంశం

తనను ప్రేమించి పెళ్లి చేసుకొని 10 మసాల పాటు కాపురం చేసిన సురేష్... ఇప్పుడు తాను  థర్డ్ జెండర్ అంటూ దూరంగా పెట్టడంపై దీపిక పోరాటం చేస్తోంది. 


రాజమండ్రి: తనను ప్రేమించి పెళ్లి చేసుకొని 10 మసాల పాటు కాపురం చేసిన సురేష్... ఇప్పుడు తాను  థర్డ్ జెండర్ అంటూ దూరంగా పెట్టడంపై దీపిక పోరాటం చేస్తోంది. ఆమెకు తోటి ధర్డ్ జెండర్లు  మద్దతుగా నిలిచారు.

విశాఖలోని పెద్ద వాల్తేరులో  తాను పదేళ్లుగా నివాసం ఉంటున్నట్టు దీపిక చెబుతోంది. ఆ సమయంలోనే చందక్ సురేష్  తనను ప్రేమించి పెళ్లాడినట్టు ఆమె చెబుతున్నారు.

తాను థర్డ్ జెండర్ అనే విషయం తెలిసే  ప్రేమించి పెళ్లాడాడని... తన కుటుంబసభ్యులకు నచ్చజెప్పుకొంటానని కూడ చెప్పాడని దీపిక చెబుతున్నారు.

పది మాసాల పాటు  తనతో కాపురం చేసి ఇప్పుడు తానో థర్ట్ జెండర్ అంటూ  దూరంగా పెట్టడం సరైందా అని ఆమె ప్రశ్నిస్తున్నారు.  రాజమండ్రిలో ఆమె నిరసనకు దిగింది.  ఆమెకు  మరికొందరు థర్డ్ జెండర్లు నిలిచారు.

సురేష్ చేస్తున్న వ్యాపారానికి తాను ఆర్థికంగా సహాయం చేసినట్టు చెప్పారు. కానీ తనను సురేష్ మోసం చేశాడని  ఆమె ఆరోపిస్తున్నారు.  తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని చెబుతున్నారు. ఇదిలా ఉంటే దీపిక చేస్తున్న ఆరోపణలను సురేష్ ఖండిస్తున్నారు.

దీపిక థర్డ్ జెండర్ అనే విషయం తనకు తెలియదని చెబుతున్నారు.  ఆమె థర్డ్ జెండర్ అని తెలిస్తే  పెళ్లి చేసుకోకపోయేవాడినని అంటున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే