వైసీపీలో టెన్షన్.. టెన్షన్.. జగన్ ఎవరి ‘టికెట్’ చించేస్తారో , తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు ఎమ్మెల్యేల క్యూ

Siva Kodati |  
Published : Dec 19, 2023, 09:59 PM ISTUpdated : Dec 19, 2023, 10:02 PM IST
వైసీపీలో టెన్షన్.. టెన్షన్.. జగన్ ఎవరి ‘టికెట్’ చించేస్తారో , తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు ఎమ్మెల్యేల క్యూ

సారాంశం

వచ్చే ఏపీ ఎన్నికల్లో మరోసారి గెలవాలని గట్టి పట్టుదలగా వున్నారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ప్రజల్లో వ్యతిరేకత వున్న వారిని, పనితీరు బాగోని వారిని పక్కనపెట్టడమే లేదంటే వారి స్థానాలను మార్చడమో చేస్తున్నారు.

వచ్చే ఏపీ ఎన్నికల్లో మరోసారి గెలవాలని గట్టి పట్టుదలగా వున్నారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇప్పటికే వై నాట్ 175 అంటూ పార్టీ శ్రేణులకు టార్గెట్ ఫిక్స్ చేసిన ఆయన తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కఠిన నిర్ణయాలకు సిద్ధమయ్యారు. ప్రజల్లో వ్యతిరేకత వున్న వారిని, పనితీరు బాగోని వారిని పక్కనపెట్టడమే లేదంటే వారి స్థానాలను మార్చడమో చేస్తున్నారు. ఇందులో తనతో తొలి నుంచి వున్న వారైనా , బంధువులైనా, ఆప్తులైనా సరే గెలవరని తెలిస్తే చాలు టికెట్ ఇవ్వనని తేల్చిచెప్పేస్తున్నారు. 

ఇప్పటికే 11 మంది నియోజకవర్గాలను మార్పు చేశారు జగన్. మరికొందరికి టికెట్లు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. అయితే త్వరలో భారీ ఎత్తున ప్రక్షాళన వుంటుందని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మంత్రులు, సిట్టింగ్‌ల్లో చాలా మందికి జగన్ ఈసారి మొండిచేయి చూపించే అవకాశం వుందని వార్తలు వస్తున్నాయి. అయితే మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్న నేతలు .. అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు తమ కుటుంబ సభ్యులతో కలిసి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి క్యూకట్టారు. 

ALso Read: వైసీపీలో స్థానచలనాలు ఎస్సీలకేనా? ఇప్పటివరకు ఎంతమందిని మార్చారంటే...

ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను కలిసిన జగన్ తన మనసులోని మాటను చెప్పేశారు. ఇంకొందరికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపుతున్నారు ముఖ్యమంత్రి. ఇవాళ మాత్రం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి మంత్రులు, ఎమ్మెల్యేల తాకిడి ఎక్కువగా వుంది. వీరిలో ఎంతమందికి జగన్ టికెట్లు కేటాయిస్తారో, ఎవరికి నో చెబుతారోనన్నది సస్పెన్స్‌గా మారింది. వైసీపీ అధినేత దూకుడు చూస్తుంటే ఎన్నికలకు మూడు నెలల ముందుగానే అభ్యర్ధులను ప్రకటించేలా కనిపిస్తోంది. తద్వారా కొత్త నేతలైతే జనంలో తిరగడానికి, పార్టీలో చోటు చేసుకునే విభేదాలను పరిష్కరించడానికి వీలు కలుగుతుందన్నది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్