ఆయనో వరస్ట్ ఫెలో.. ఆ ఏరియాలో ఉమా వల్లే టీడీపీ నాశనం, పెద్ద తలకాయలూ దూరం : వసంత కృష్ణ ప్రసాద్

టీడీపీ నేత , మాజీ మంత్రి దేవినేని ఉమాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.  దేవినేని ఉమా వల్ల ఉమ్మడి జిల్లాలో పశ్చిమ భాగంలో టిడిపి నాశనం అయిందన్నారు. ఉమా ఒక మనిషిగా కూడా విలువ కోల్పోయిన నీచుడని .. చిల్లర రాజకీయాలు ఆయన నైజమని వసంత ఘాటు విమర్శలు చేశారు.

ysrcp mla vasantha krishna prasad slams tdp leader devineni uma ksp

టీడీపీ నేత , మాజీ మంత్రి దేవినేని ఉమాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోటికలపూడి గ్రామంలో సొసైటీ భవనాన్ని ఆయన ప్రారంభించారు . అనంతరం వసంత మీడియాతో మాట్లాడుతూ.. దేవినేని ఉమా ఒక వరస్ట్ ఫెలో అన్నారు. దేవినేని ఉమా వల్ల ఉమ్మడి జిల్లాలో పశ్చిమ భాగంలో టిడిపి నాశనం అయిందన్నారు. ఉమా వైఖరి నచ్చక మరికొన్ని పెద్ద తలకాయలు పార్టీకి దూరంగా ఉంటున్నాయని వసంత కృష్ణ ప్రసాద్ ఆరోపించారు. 

పార్టీని నాశనం చేసి ఇప్పుడు మైలవరం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయం కాక ప్రతి వారికి ఏదో ఒక వృత్తి ఉంటుంది, నీచ రాజకీయమే ఆయన ప్రవృత్తి అని కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఉమా ఒక మనిషిగా కూడా విలువ కోల్పోయిన నీచుడని .. చిల్లర రాజకీయాలు ఆయన నైజమని వసంత ఘాటు విమర్శలు చేశారు. అభివృద్ధి సంక్షేమంలో మైలవరం దూసుకెళ్తుండటం ఆయనకి ఇష్టం లేదని కృష్ణ ప్రసాద్ దుయ్యబట్టారు. అభివృద్ధి చూసి ఆయనకు నిద్ర పట్టడం లేదని.. ఐదేళ్లలో తాను రూ.1000 కోట్లు అవినీతి చేస్తే..పదేళ్లలో ఆయన ఎంత చేశాడో చెప్పాలని వసంత కృష్ణ ప్రసాద్ ప్రశ్నించారు. 

Latest Videos

vuukle one pixel image
click me!