ఐటెం గాళ్లు: పరిటాల శ్రీరామ్‌కి వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి కౌంటర్

Published : Jan 19, 2021, 01:13 PM IST
ఐటెం గాళ్లు: పరిటాల శ్రీరామ్‌కి వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి కౌంటర్

సారాంశం

మీరు ఐటెం గాళ్లు... సమాజానికి చేసిందేమీ లేదు.. నిజంగా అభివృద్ది చేస్తే  25 వేల ఓట్ల మెజారిటీతో ఎందుకు ఓడిపోయారని రాఫ్తాడు ఎమ్మెల్యే తోపుదుర్ది ప్రకాష్ రెడ్డి టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ను ప్రశ్నించారు.

అనంతపురం: మీరు ఐటెం గాళ్లు... సమాజానికి చేసిందేమీ లేదు.. నిజంగా అభివృద్ది చేస్తే  25 వేల ఓట్ల మెజారిటీతో ఎందుకు ఓడిపోయారని రాఫ్తాడు ఎమ్మెల్యే తోపుదుర్ది ప్రకాష్ రెడ్డి టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ను ప్రశ్నించారు.

మంగళవారం నాడు రాఫ్తాడు ఎమ్మెల్యే తోపుదుర్ది ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అనంతపురం జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం చోటు చేసుకొంది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్ది ప్రకాష్ రెడ్డిపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ విమర్శలు చేశారు.ఈ విమర్శలకు ఎమ్మెల్యే తోపుదుర్ది ప్రకాష్ రెడ్డి కౌంటరిచ్చారు.

తన గురించి మాట్లాడేందుకు నీకు ఉన్న యోగ్యత ఏమిటని ఆయన ప్రశ్నించారు. మీరు లా మేకర్స్ కాదు.. లా బ్రేకర్స్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తప్పుడు ప్రచారాలు, తప్పుడు కూతలతో పత్రికలతో ప్రచారం పొందుతున్నారన్నారు. సూడో నక్సలైట్లను అడ్డు పెట్టుకొని కిరాయి హంతకులతో ఖూనీలు చేయించారని ప్రకాష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కియా పరిశ్రవ వస్తోందని తెలిసి అక్కడ రెండు వేల ఎకరాల భూములు కొనుగోలు చేశారని చెప్పారు. వాటిపై మరోసారి మాట్లాడుతానని చెప్పారు.

మీ వ్యాపారాల కోసం, గన్‌మెన్ ల కోసం ఎవరి కాళ్లు పట్టుకొంటున్నారో అందరికీ తెలుసునని చెప్పారు. మీ తాత నారాయణ చౌదరి దగ్గర డబ్బులు ఆశిస్తామని ఆని ఆయన ప్రశ్నించారు. మీ మాదిరిగా దోచుకొని దాచుకోవాలని కాదని ఆయన చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు