కాంట్రాక్టర్‌ను డబ్బులు అడిగానా.. కాణిపాకంలో ప్రమాణం చేద్దాం రండి : వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి సవాల్

Siva Kodati |  
Published : Sep 12, 2022, 07:35 PM IST
కాంట్రాక్టర్‌ను డబ్బులు అడిగానా.. కాణిపాకంలో ప్రమాణం చేద్దాం రండి : వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి సవాల్

సారాంశం

తాను కాంట్రాక్టర్‌ను డబ్బులు అడిగినట్లుగా జరుగుతున్న ప్రచారంపై స్పందించారు వైసీపీ నేత, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్ది ప్రకాశ్ రెడ్డి. దమ్ముంటే కాణిపాకం వచ్చి ప్రమాణం చేయాలని ఆయన సవాల్ విసిరారు.   

కాంట్రాక్టర్‌ను డబ్బులు అడిగానని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నేత, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్ది ప్రకాశ్ రెడ్డి. కావాలంటే కాణిపాకంలో ప్రమాణం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. డబ్బు అడిగానని చెప్పేవాళ్లు  ప్రమాణం చేస్తారా అనపి తోపుదుర్తి సవాల్ విసిరారు. పరిటాల సునీత, శ్రీరామ్‌ కబ్జాలు, దౌర్జన్యాలు చేస్తూ తమపై నిందలు వేస్తున్నారని ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. తనపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించి కావాలంటే సీబీఐ విచారణ వేసుకోవచ్చన్నారు. 

అంతకుముందు గత నెలలో పోలీసులపై పరిటాల శ్రీరామ్, సునీతల వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి. పోలీసులు నిజాయితీగా పనిచేస్తుంటే పరిటాల కుటుంబానికి నచ్చదన్నారు. క్రిమినల్స్‌కు షెల్టర్ ఇచ్చే సంస్కృతి వారిదేనంటూ తోపుదుర్తి చురకలు వేశారు. పరిటాల శ్రీరామ్ దౌర్జన్యాలు చేస్తానంటే కుదరదని ఆయన హెచ్చరించారు.  అంతేకాదు.. గన్‌మెన్‌లు లేకుండా బయటకు రాగలరా అని సవాల్ విసిరారు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి. 

Also Read:పోలీసుల పనిపడతామన్న పరిటాల శ్రీరామ్.. గన్‌మెన్‌లు లేకుండా బయటకు రండి: తోపుదుర్తి సవాల్

అదే నెల నెల 9వ తేదీన పరిటాల శ్రీరామ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించిన సంగతి తెలిసిందే.  రైతు సమస్యలపై శనివారం గొందిరెడ్డిపల్లిలో నిరసనకు పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే పరిటా శ్రీరామ్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయన బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో పరిటాల ఇంటి వద్ద కూర్చొని నిరసనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో తాము పోరాటం చేస్తుంటే పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. వైసీపీ నేతల ప్రోత్బలంతో మమ్మల్ని అడ్డుకోవడం పోలీసులకు ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. “చలో గొందిరెడ్డిపల్లి” కార్యక్రమాన్ని ముందస్తుగా అడ్డంకులు సృష్టించడానికి పోలీసులను ఉపయోగించుకుంటూ నోటీసులు ఇవ్వడం సరైన పద్ధతి కాదని చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్