అడిగినన్ని రోజులు అసెంబ్లీ పెట్టాం.. వాళ్లే పారిపోయారు: టీడీపీపై శ్రీకాంత్ రెడ్డి విమర్శలు

Siva Kodati |  
Published : Nov 26, 2021, 06:28 PM ISTUpdated : Nov 26, 2021, 06:30 PM IST
అడిగినన్ని రోజులు అసెంబ్లీ పెట్టాం.. వాళ్లే పారిపోయారు: టీడీపీపై శ్రీకాంత్ రెడ్డి విమర్శలు

సారాంశం

మహిళా సాధికారికత సహా పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చ జరిపినట్లు చెప్పారు వైసీపీ (ysrc) ఎమ్మెల్యే , ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి . . ప్రతిపక్షాల విజ్ఞప్తి మేరకు సమావేశాలు  7 రోజులు నిర్వహించామని.. ప్రజా సమస్యలు మీద చర్చ జరపలేక పారిపోయారని ఆయన దుయ్యబట్టారు. 

మహిళా సాధికారికత సహా పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చ జరిపినట్లు చెప్పారు వైసీపీ (ysrc) ఎమ్మెల్యే , ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి (srikanth reddy). ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల (ap assembly winter session 2021) అనంతరం సభ నిరవధిక పడింది. ఆ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అకాల వర్షాల కారణంగా కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో చోటు చేసుకున్న నష్టంపైనా (floods in ap) చర్చించామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అన్ని అంశాల మీద సుదీర్ఘంగా జరిగిందని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. ప్రతిపక్షాల విజ్ఞప్తి మేరకు సమావేశాలు  7 రోజులు నిర్వహించామని.. ప్రజా సమస్యలు మీద చర్చ జరపలేక పారిపోయారని ఆయన దుయ్యబట్టారు. 

అసెంబ్లీలో ఎలాంటి గొడవ జరగకపోయినా వెళ్లిపోయారని... కౌరవసభ అని విమర్శలు చేశారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. కౌరవసభ తమది కాదని.. 2014 నుండి 19 వరకు మీరున్నపుడు కౌరవ సభ జరిగిందంటూ ఆయన కౌంటరిచ్చారు. ఇపుడు జరిగిన సమావేశాలు హిస్టారికల్ అన్న శ్రీకాంత్ రెడ్డి.. అన్ని వర్గాల వారికి సంబంధించిన అంశాల మీద చర్చ జరిగినట్లు చెప్పారు. టీడీపీ (tdp) అడిగిన అన్ని అంశాల మీదా చర్చ జరిగిందని.. సమావేశంలో పాల్గొనకపోయినా తమ మీద విమర్శలు చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఫైరయ్యారు. మహిళలను విమర్శించారని.. ప్రతిపక్ష నేత ప్రవర్తనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన సెటైర్లు వేశారు. వరదల కొసం వెళ్లి సానుభూతి రాజకీయాలు చేస్తున్నారని.. టీడీపీ నేతలు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని శ్రీకాంత్ రెడ్డి హితవు పలికారు. 

Also Read:విపత్తును కూడా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి: ఏపీ అసెంబ్లీలో వరదలపై జగన్

అంతకుముందు అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ వరదలతో కలిగిన ప్రాణ, ఆస్తి నష్టం గురించి మాట్లాడారు. ఆకాశానికే చిల్లు పడిందా అన్నట్టుగా వర్షం పడడం వల్ల నష్టం ఎక్కువగా వాటిల్లిందని సీఎం అభిప్రాయపడ్డారు.పింఛ ప్రాజెక్టు ఔట్‌ఫ్లో కంటే మూడు రెట్లు ఎక్కువగా ఇన్‌ఫ్లో వచ్చిందని సీఎం జగన్ చెప్పారు.చెయ్యేరు నది పరివాహక ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నట్టుగా ఆయన గుర్తు చేశారు.tirupati, శేషాచలం పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షం మొత్తం చెయ్యేరులోకి చేరిందని సీఎం తెలిపారు.చెయ్యేరు. వరద ఉధృతిలో ఓ బస్సు కూడా చిక్కుకుపోవడం వల్ల ప్రాణ నష్టం ఎక్కువగా ఉందన్నారు. వరద ఉధృతికి ప్రాజెక్టుల కట్టలు కూడా తెగిపోయాయన్నారు. ఏడాదిలో ఒక్క సారి కూడా నిండని జలాశయాలు ఒకటి రెండు రోజుల్లోనే నిండిపోయాయని చెప్పారు. 

గాల్లోనే వచ్చి గాల్లోనే పోతానని, ఎక్కడో ఒక్క చోటు శాశ్వతంగా కనుమరుగు అవుతానని తనపై చంద్రబాబు (chandrababu naidu) చేసిన విమర్శలపై కూడా జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. తనను వ్యతిరేకించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా కాల గర్భంలో కలిసిపోయాడని చంద్రబాబు విమర్శలు చేసిన కామెంట్స్ ను జగన్ అసెంబ్లీలో చదివి విన్పించారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లాడు, ఏం మాట్లాడో అర్ధం కావడం లేదన్నారు. చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారాలు అంటూ జగన్ సెటైర్లు వేశారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్