కడప జిల్లా వైసీపీకి కంచుకోట.... బద్వేల్‌లో భారీ మెజార్టీ తథ్యం: శ్రీకాంత్ రెడ్డి ధీమా

Siva Kodati |  
Published : Sep 30, 2021, 04:47 PM ISTUpdated : Sep 30, 2021, 04:51 PM IST
కడప జిల్లా వైసీపీకి కంచుకోట.... బద్వేల్‌లో భారీ మెజార్టీ తథ్యం: శ్రీకాంత్ రెడ్డి ధీమా

సారాంశం

కడప జిల్లా వైసీపీకి కంచుకోట అన్నారు ఆ పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డి. బద్వేల్ ఉపఎన్నిక నేపథ్యంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఉపఎన్నికలో థైర్యంగా ప్రజల ముందుకు వెళ్తామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

కడప జిల్లా వైసీపీకి కంచుకోట అన్నారు ఆ పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డి. బద్వేల్ ఉపఎన్నిక నేపథ్యంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఉపఎన్నికలో థైర్యంగా ప్రజల ముందుకు వెళ్తామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. బద్వేల్ ఉపఎన్నికలో భారీ మెజారిటీ సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చామని.. కుప్పంలో జరిగిన పరాభవంతో టీడీపీ నేతలు తలెత్తుకోలేకపోతున్నారని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆన్‌లైన్ టికెటింగ్‌పై అభ్యంతరాలుంటే చెప్పాలని... కొందరు కులమతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కులాలను తెరపైకి తెచ్చి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం జగన్ అన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?