పట్టాభితో బూతులు .. కుప్పంలో బాంబు డ్రామాలు, దేన్నీ జనం నమ్మలేదు: బాబుకి రోజా చురకలు

By Siva KodatiFirst Published Oct 30, 2021, 5:47 PM IST
Highlights

టీడీపీ (tdp)  అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై (chandrababu naidu) మండిపడ్డారు నగరి (nagari) వైసీపీ (ysrcp) ఎమ్మెల్యే రోజా (roja). పట్టాభితో బూతు డ్రామాలు ఆడించి, కుప్పంలో బాంబు డ్రామా ఆడించి ప్రజలని నమ్మించాలని చూసినా ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితుల్లో లేరని రోజా సెటైర్లు వేశారు. 

టీడీపీ (tdp)  అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై (chandrababu naidu) మండిపడ్డారు నగరి (nagari) వైసీపీ (ysrcp) ఎమ్మెల్యే రోజా (roja). శనివారం నగరి మునిసిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఎక్స్ అఫిషియో మెంబర్ హోదాలో రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులపై మునిసిపల్ కౌన్సిల్ ప్రతిపాదించిన తీర్మానాలను ఆమోదించారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు ఎంత ఫ్రస్టేషన్‌లో ఉన్నాడో అంతకన్నా ఎక్కువ ఫ్రస్టేషన్‌లో నగిరి నియోజకవర్గ టీడీపీ నాయకులున్నారంటూ ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

బాబు 14 ఏళ్ల ముఖ్యమంత్రా.. లేక వీధి రౌడీనా?. ముందు 'యధా రాజా తథా ప్రజా' అంటారని అయితే ఇప్పు‍డు 'యధా రాజా తథా చంద్రబాబు' అన్నది తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకే సరిపోతుందంటూ దుయ్యబట్టారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, అతనిని నమ్మి ఓటేసిన కుప్పం (kuppam) నియోజకవర్గ ప్రజలకి హంద్రీ నీవా ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు కూడా ఇవ్వకుండా చేశారని రోజా ఆరోపించారు. అది చేయకుండా జగన్‌మోహన్ రెడ్డి ( ys jagan) నీరు ఇవ్వలేదని విమర్శించడం ఏంటని ఆమె ప్రశ్నించారు. కుప్పంలో కనీసం ఇళ్లు, కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకోకుండా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమాలను గాలికి వదిలేశారని రోజా ఎద్దేవా చేశారు. 

ALso Read:చంద్రబాబుపై బాంబు విసిరేందుకు వచ్చాడని.. టూరిజం ఉద్యోగిపై టీడీపీ కార్యకర్తల దాడి...

కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు టీడీపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయనే విషయాన్ని గుర్తు చేసుకోవాలంటూ ఆమె చురకలు వేశారు. గత వారం పట్టాభితో బూతు డ్రామాలు ఆడించి, కుప్పంలో బాంబు డ్రామా ఆడించి ప్రజలని నమ్మించాలని చూసినా ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితుల్లో లేరని రోజా సెటైర్లు వేశారు. కుప్పంలో ఏ ఎలక్షన్స్ జరిగినా వార్ వన్ సైడ్ అన్నట్టుగా జగన్‌మోహన్‌ రెడ్డికే జనం పట్టం కడతారనే విషయాన్ని చంద్రబాబు ఇప్పటికైనా గ్రహించాలని రోజా హితవు పలికారు. చంద్రబాబు ... క్యాడర్ మొత్తం చేజారి పోతుందన్న భయంతో దిగజారుడు రాజకీయాలకు పాల్పడితే చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని రోజా హెచ్చరించారు.

కాగా.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి (kommareddy pattabhi)చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలతో పాటు నేతల ఇళ్లపై వైసీపీ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే. అటు పట్టాభి ఇంటిపైనా దాడులు జరిగాయి. దీంతో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు 36 గంటల పాటు దీక్షకు దిగారు. అంతేకాకుండా స్వయంగా ఢిల్లీ (chandrababu delhi tour) వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కి (ramnath kovind) ఫిర్యాదు కూడా చేశారు. 

click me!