Diwali 2021 : దీపావళి పండుగకి ప్రత్యేక రైళ్లు

Published : Oct 30, 2021, 01:34 PM IST
Diwali 2021 : దీపావళి పండుగకి ప్రత్యేక రైళ్లు

సారాంశం

దీపావళి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు పలు ట్రైన్లను ఏర్పాటు చేసింది. ఆ వివరాలు... 

విజయవాడ : దీపావళి పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా పలు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. 

మచిలీపట్నం–కర్నూలు సిటీ ప్రత్యేక రైలు (07067) నవంబర్‌ 6, 9, 11, 13, 16, 18, 20, 23, 25, 27, 30 తేదీల్లో మధ్యాహ్నం 3.50కి 
Machilipatnamలో బయలుదేరుతుంది. 

తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07068) నవంబర్‌ 7, 10, 12, 14, 17, 19, 21, 24, 26, 28, డిసెంబర్‌ 1వ తేదీల్లో రాత్రి 8.00 గంటలకు కర్నూలు సిటీలో బయల్దేరుతుంది.  

నర్సాపూర్‌–సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు (07455) ఈ నెల 31, నవంబర్‌ 7, 14 తేదీల్లో సాయంత్రం 6.00 గంటలకు Narsapurలో బయలుదేరుతుంది.  

సికింద్రాబాద్‌–విజయవాడ ప్రత్యేక రైలు (07456) నవంబర్‌ 1, 8, 15 తేదీల్లో రాత్రి 10.55 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది.  

సికింద్రాబాద్‌–దానాపూర్‌ ప్రత్యేక రైలు (07460) నవంబర్‌ 7వ తేదీ ఉదయం 5.50 గంటలకు Secunderabadలో బయలుదేరుతుంది. 

తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07459) నవంబర్‌ 11న ఉదయం 11.00 గంటలకు దానాపూర్‌లో బయలుదేరుతుంది. 

Visakhapatnam – Secunderabad ప్రత్యేక వారాంతపు రైలు (08579) నవంబర్‌ 3, 10, 17 తేదీల్లో రాత్రి 7.00 గంటలకు విశాఖలో బయలుదేరుతుంది. 

తిరుగు ప్రయాణంలో ఈ రైలు (08580) నవంబర్‌ 4, 11, 18 తేదీల్లో రాత్రి 7.40 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది.

దీపావళి సంబురాలపై ఆంక్షలు.. క్రాకర్స్‌పై కలకత్తా హైకోర్టు బ్యాన్

టపాసులు నిషేధం.. ముఖ్యమంత్రి కీలక నిర్ణయం...
ఇదిలా ఉండగా, దీపావళి పండగ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గాలి నాణ్యత తక్కువగా ఉన్న జాతీయ రాజధాని ప్రాంతం(NCR)తో పాటుగా ఇతర ప్రాంతాల్లో టపాసులఅమ్మకం, వాడకాన్ని నిషేధిస్తున్నట్టుగా ప్రకటించింది. 

ఈ మేరకు ఉత్తరప్రదేశ్ హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది. గాలి నాణ్యత సరిపడే అంత లేక మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే గ్రీన్ టపాసుల వినియోగాన్ని అనుమతించనున్నట్టుగా ఉత్తర్వుల్లో పేర్కొంది. 

రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, పోలీసు ఉన్నతాధికారులకు టపాసుల విక్రయం, వినియోగానికి సంబంధించి వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేసినట్టుగా ఉత్తరప్రదేశ్ హోం శాఖ అదరనపు కార్యదర్శి అవనీష్ కుమార్ అవస్తీ తెలిపారు. 

‘ఎయిర్ క్వాలిటీ మోడరేట్ లేదా అంతకంటే తక్కువగా ఉన్న నగరాల్లో green crackers రెండు గంటలకు మించి కాల్చకండి. క్రిస్మస్, న్యూ ఇయర్, సమయాల్లో గ్రీన్ క్రాకర్స్ రాత్రి 11.55 గంటల నుంచి 12.30 మధ్య మాత్రమే కాల్చాలి.. ఎయిర్ క్వాలిటీ మోడరేట్ లేదా అంతకంటే తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ నిబంధన పాటించాలి’అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

నోయిడా, ఘజియాబాద్‌లలో గాలి నాణ్యత 'మోడరేట్' కేటగిరీలో ఉండటం గమనార్హం. ఇక, హాపూర్, లక్నో, కాన్పూర్, ఆగ్రా, సోన్‌భద్ర, వారణాసి, ఫిరోజాబాద్, ఝాన్సీ, ఖుర్జా, ప్రయాగ్‌రాజ్, మీరట్, మొరాదాబాద్, బరేలీ, రాయ్ బరేలీ, మధుర, సహరాన్‌పూర్, గోరఖ్‌పూర్, ఉన్నావ్, ముజఫర్‌నగర్, బాగ్‌పట్, బులంద్‌షహర్, అలీఘర్ ఇతర నగరాల‌లో కూడా ఎయిర్ క్వాలిటీ మోడరేట్‌గా‌నే ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్