ఆ ఉద్దేశంతోనే మద్యం ధరలు పెంచాం... టీడీపీ నేతలకు ఇబ్బంది ఏంటి: రోజా ఫైర్

By Siva Kodati  |  First Published May 4, 2020, 7:03 PM IST

కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా అమల్లో నేపథ్యంలో ఏపీలో మద్యం షాపులు పున: ప్రారంభించడంతో జగన్ సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది


కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా అమల్లో నేపథ్యంలో ఏపీలో మద్యం షాపులు పున: ప్రారంభించడంతో జగన్ సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.

మద్యం షాపుల దగ్గర సామాజిక దూరం కూడా పాటించడం లేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇటు ప్రతిపక్షం విమర్శలకు అధికార పార్టీ కూడా కౌంటర్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో మద్యం ధరల పెంపు, తాజా పరిణామాలపై వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా స్పందించారు.

Latest Videos

undefined

Also Read:జె ట్యాక్స్ కోసం... రెడ్ జోన్లలో లిక్కర్ షాపులు తీస్తారా: జగన్‌పై బుద్ధా ఫైర్

ధరలు పెంచితే పేదవాడు మద్యానికి దూరం అవుతారని ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ధరలు పెంచిందన్నారు రోజా. మద్యపాన నిషేధంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు. మద్యం ధరలు పెంచితే తెలుగుదేశం నేతలు ఎందుకు బాధపడుతున్నారని రోజా నిలదీశారు.

టీడీపీ హయాంలో చంద్రబాబు మద్యాన్ని ఏరులై పారిస్తే.. జగన్ సర్కార్ దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తోందన్నారు. రాష్ట్రంలో 40 వేల బెల్టు షాపులు, 20 శాతం వైన్ షాపుులు, 40 శాతం బార్లను తొలగించారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని రోజా చెప్పారు.

Also Read:అన్నం ప్యాకెట్లు పంచుతుంటే అడ్డుకున్నారు.. లిక్కర్ షాపులు ఎలా తెరుస్తారు: వర్ల రామయ్య

కరోనా కట్టడికి సీఎం జగన్ తీవ్రంగా కృషి చేస్తుంటే... చంద్రబాబు, టీడీపీ నేతలు ఏసీ గదుల్లో కూర్చొని విమర్శలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా విమర్శలు మానుకోవాలని రోజా హితవు పలికారు.

మరోవైపు లాక్‌డౌన్‌ను సడలిస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం వైన్‌షాపులు ఓపెన్ చేయడంతో మందుబాబులు బారులు తీరారు. మంగళగిరిలో తెల్లవారుజాము నుంచే మద్యం ప్రియులు వైన్‌షాపుల ఎదుట క్యూకట్టారు. అటు ప్రభుత్వ ఆదేశాల మేరకు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అమ్మకాలను చేపట్టడానికి ఎక్సైజ్ అధికారులు చర్యలు చేపట్టారు. 

click me!