నీ కంటే ఎక్కువే బూతులొచ్చు.. శాడిస్ట్‌వి, సైకోవి : అయ్యన్నపాత్రుడిపై పూరీ జగన్నాథ్ సోదరుడి ఆగ్రహం

Siva Kodati |  
Published : Jan 21, 2023, 03:58 PM IST
నీ కంటే ఎక్కువే బూతులొచ్చు.. శాడిస్ట్‌వి, సైకోవి : అయ్యన్నపాత్రుడిపై పూరీ జగన్నాథ్ సోదరుడి ఆగ్రహం

సారాంశం

వైసీపీ నేతలు, ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. అయ్యన్న ఓ సైకో, శాడిస్టు అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై మండిపడ్డారు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అయ్యన్నపాత్రుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్న కంటే తాము ఎక్కువగానే బూతులు తిట్టగలమని, చంద్రబాబును తాము తిట్టలేమా అని గణేష్ ప్రశ్నించారు. అయ్యన్న ఓ సైకో, శాడిస్టు అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

నర్సీపట్నంను గంజాయి అడ్డాగా మార్చిందని అయ్యన్నేనని గణేష్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే అయ్యన్న అన్ని పార్టీల నేతలను ఇంటింటికి వెళ్లి కలుస్తున్నాడని ఆయన దుయ్యబట్టారు. ఎంతమంది చంద్రబాబు, అయ్యన్నలు వచ్చినా జగన్‌ను ఏం చేయలేరని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పొత్తులు లేకుండా 175 స్థానాల్లో పోటీ చేసే ధైర్యం టీడీపీకి, చంద్రబాబుకు వుందా అని ఉమా శంకర్ ప్రశ్నించారు.

ALso REad: పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎక్కడ దాక్కున్నారు: గంటాపై అయ్యన్నపాత్రుడు

ఇదిలావుండగా.. చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇటీవల వైసిపి నాయకులు, పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మరో ఎనిమిది నెలల తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని... ఇప్పుడు తమపై తప్పుడు కేసులు నమోదు చేసే పోలీసులు అప్పుడు మా చంక నాకాల్సి వస్తుందని అన్నారు. నాకు లా అండ్ ఆర్డర్ మంత్రి పదవి కావాలని... అప్పుడు పోలీసులు లిస్ట్ రాసుకుని ఏం చేయాలో చేస్తానంటూ హెచ్చరించారు. చెత్త పై పన్ను వేసేవాడు చెత్త నా కొడుకు కాక మరేంటో చెప్పాలని... ఆ మాట అన్నందుకే తనపై కేసులు పెట్టారని అయ్యన్న అన్నారు. ఇక మంత్రి రోజా తనను మగాడు కాదని అంది... ఆ విషయం ఆమెకెలా తెలుసు... ఓసారి చూస్తేనేగా తెలిసేది అంటూ అయ్యన్న సంచలన వ్యాఖ్యలు చేసారు.  
 

PREV
click me!

Recommended Stories

Chandrababu Naidu With Bhuvaneshwari at Raj Bhavan ‘At Home’ Event | Asianet News Telugu
‘స్త్రీ శక్తి' లబ్ధిదారులతో సామాన్యుడిలా టికెట్ తీసుకుని ప్రయాణించిన సీఎం | Stree Shakti Scheme