పవన్‌ కల్యాణ్‌పై పోటీకి సిద్ధమన్న అలీ.. నాగబాబు స్పందన ఇదే

By Siva KodatiFirst Published Jan 21, 2023, 3:19 PM IST
Highlights

హైకమాండ్ ఆదేశిస్తే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోటీచేస్తానన్న సినీనటుడు అలీ వ్యాఖ్యలపై స్పందించారు జనసేన నేత నాగబాబు. వైసీపీలా తాము దిగజారి మాట్లాడమని,పవన్‌ను సీఎం చేయడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

హైకమాండ్ ఆదేశిస్తే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోటీచేస్తానన్న సినీనటుడు అలీ వ్యాఖ్యలపై స్పందించారు జనసేన నేత నాగబాబు. దీనికి నాగబాబు నో కామెంట్స్ అంటూ తేల్చేశారు. పొత్తుల విషయంలో ఎలా ముందుకు వెళ్లున్నామనే విషయాన్ని పవన్ చూసుకుంటారని అన్నారు. పొత్తులు కుదరకముందే పోటీ చేయబోయే స్థానాలపై మాట్లాడటం సరికాదని.. అరాచకం, దుర్మార్గం, దౌర్జన్యం కలిస్తే వైసీపీ అంటూ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో నాలుగేళ్లుగా అరాచకం, రౌడీరాజ్యం, గంజాయిలు రాజ్యమేలుతున్నాయని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ అంటున్నారంటే దాని వెనుక ఏదో వ్యూహం వుండే వుంటుందని నాగబాబు వ్యాఖ్యానించారు. వైసీపీలా తాము దిగజారి మాట్లాడమని,పవన్‌ను సీఎం చేయడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు లేకుంటే అన్ని స్థానాల్లోనూ జనసేన పోటీ చేస్తుందని నాగబాబు వెల్లడించారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనని, పార్టీని పటిష్టం చేస్తానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ALso REad :పొత్తులు ఎవరితో అనేది పవన్ కల్యాణ్ ప్రకటిస్తారు.. అవన్నీ కలిస్తేనే వైసీపీ: జనసేన నేత నాగబాబు

ఇదిలా ఉంటే శుక్రవారం కర్నూలుకు చేరుకున్న నాగబాబుకు జనసేన శ్రేణులు స్వాగతం పలికాయి. సాయంత్రం నాగబాబను సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కలిశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడిన నాగబాబు.. జనసేన అధికారంలోకి రాగానే పవన్ కల్యాణ్ సుగాలి ప్రీతి కేసుపై దృష్టి పెడతారని తెలిపారు. జనసైనికులు, వీర మహిళలతో మాట్లాడి సమస్యలు తెలుసుకునేందుకు కర్నూలు వచ్చినట్టుగా చెప్పారు. జనసేన పొత్తులు ఎవరితో అనేది పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని చెప్పారు. ఇంకా ఏం రాకముందే మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని అన్నారు. పొత్తుల తర్వాత ఎవరు.. ఎక్కడ పోటీ చేయాలో నిర్ణయం ఉంటుందని తెలిపారు. 

ఇకపోతే.. సినీ నటుడు , ఏపీ ప్రభుత్వ సలహాదారు అలీ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోటీ చేయడానికి తాను సిద్ధమని ఆయన ప్రకటించారు.  సీఎం ఆదేశిస్తే ఎవరిపైనైనా పోటీ చేస్తానని అలీ స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఎవరు మేలు చేస్తారో ప్రజలకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. విమర్శలు ప్రతి విమర్శలు చేయటం సాధారణమని.. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని అలీ అన్నారు. చిత్తూరు జిల్లా నగరి పర్యటనలో భాగంగా మంగళవారం అలీ ఈ వ్యాఖ్యలు చేశారు.
 

click me!