‘‘ ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వొచ్చావా’’ .. ఆ సినిమాలో ఎన్టీఆర్ పాటలా, యార్లగడ్డ పరిస్ధితి : కొడాలి నాని

Siva Kodati |  
Published : Aug 22, 2023, 09:28 PM IST
‘‘ ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వొచ్చావా’’ .. ఆ సినిమాలో ఎన్టీఆర్ పాటలా, యార్లగడ్డ పరిస్ధితి : కొడాలి నాని

సారాంశం

ఎన్టీఆర్ సినిమాలోని ఎవరో ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వొచ్చావా అన్నట్లుగా యార్లగడ్డ వెంకట్రావు పరిస్ధితి వుందన్నారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. జగన్ దింపిన అభ్యర్ధి చేతిలో ఓడిపోయిన బచ్చా లోకేష్ అంటూ కొడాలి నాని ఎద్దేవా చేశారు

కృష్ణా జిల్లా గన్నవరం రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్న సంగతి తెలిసిందే. నిన్నటి వరకు వైసీపీలో వున్న యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలోకి చేరడం, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడంతో అక్కడి పరిణామాలు వేగంగా మారిపోయాయి.  ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ సినిమాలోని ఎవరో ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వొచ్చావా అన్నట్లుగా యార్లగడ్ద వ్యవహారం వుందన్నారు.

2024 ఎన్నికల్లో ఓటమిని ముందే ఊహించిన చంద్రబాబు.. ఓట్ల తొలగింపును కారణంగా చూపేందుకు సిద్ధమవుతున్నారని కొడాలి నాని ఆరోపించారు. నారా లోకేష్ గన్నవరంలో పాదయాత్ర చేస్తే గుడివాడలో ట్రాఫిక్ జామ్ అయ్యిందంటూ సెటైర్లు వేశారు. జగన్ దింపిన అభ్యర్ధి చేతిలో ఓడిపోయిన బచ్చా లోకేష్ అంటూ కొడాలి నాని ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ 10 చోట్ల గెలిచిందని.. మరి అసెంబ్లీ ఎన్నికల్లో 22 చోట్ల గెలుస్తుందా అంటూ వ్యాఖ్యానించారు . 

కాగా.. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇటీవల చిరంజీవి తమ ప్రభుత్వం గురించే ఏదో మాట్లాడాడంటూ వైసిపి నాయకులు ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంత్రి కొడాలి నాని కూడా పకోడి గాళ్లు కూడా తమకు సలహా ఇస్తున్నారంటూ చిరంజీవిపై నాని విరుచుకుపడ్డారు. అయితే తాజాగా చిరంజీవి విషయంలో నాని యూటర్న్ తీసుకున్నారు. గుడివాడలో చిరంజీవి అభిమానులు ఏర్పాటుచేసిన పుట్టినరోజు వేడుకల్లో కొడాలి నాని పాల్గొని కేక్ కట్ చేసారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి ఫోటోలతో కూడిన ప్లకార్డులు అభిమానులు ప్రదర్శించారు. చిరంజీవి భర్త్ డే కేక్ కట్ చేసి అభిమానులకు తిరిపించారు కొడాలి నాని. 

ALso Read: చిరంజీవిపై విమర్శలు: యూటర్న్ తీసుకున్న కొడాలి నాని (వీడియో)

ఈ సందర్భంగా వైసిపి ఎమ్మెల్యే  నాని మాట్లాడుతూ... చిరంజీవిని తాను ఎప్పుడూ విమర్శించలేదని అన్నారు. తమకు ఇచ్చినట్లే సినీ ఇండస్ట్రీలో డ్యాన్సులు, నటన చేతగాని పకోడీగాళ్ళకు సలహాలు ఇవ్వాలనే చిరంజీవికి చెప్పాను... అంతేగానీ ఆయనను  పకోడిగాడు అనలేదన్నారు. తాను చిరంజీవిని విమర్శించానని జనసేన, టిడిపి నాయకులు తప్పుడు ప్రచారం చేసారని... దమ్ముంటే తాను తిట్టినట్లు నిరూపించాలని కొడాలి నాని చాలెంజ్ చేసారు. 

చిరంజీవి గురించి తాను ఏం మాట్లాడానో ఆయనను, అభిమానులకు తెలుసు... తామంతా క్లారిటీగానే వున్నామన్నారు. రాజకీయంగా చిరంజీవి విమర్శిస్తే ఏం జరుగుతుందో తనకు తెలుసు... అయినా ఎలా మాట్లాడతానని అన్నారు. చిరంజీవికి ,తమకు మద్య అగాధం సృష్టించాలని టిడిపి, జనసేన కుట్రలు పన్నుతోందని... అందులో భాగంగానే విమర్శించినట్లు తప్పుడు ప్రచారం చేసారన్నారు. చిరంజీవి అభిమానుల ముసుగులో కొందరు గుడివాడ రోడ్లమీద దొర్లి ఏదో జరిగిపోయిందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసారని కొడాలి నాని అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం