టీడీపీ నేతలతో కలిసి ప్రెస్‌మీట్లు పెట్టాలి: కన్నాపై కాసు మహేశ్ రెడ్డి విమర్శలు

By Siva Kodati  |  First Published Apr 21, 2020, 8:38 PM IST

కరోనా టెస్ట్ కిట్ల  వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలను వేడెక్కించింది. దీనిపై టీడీపీ, బీజేపీలు అధికార వైఎస్సార్‌సీపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్  రెడ్డి. 


కరోనా టెస్ట్ కిట్ల  వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలను వేడెక్కించింది. దీనిపై టీడీపీ, బీజేపీలు అధికార వైఎస్సార్‌సీపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్  రెడ్డి.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రతిపక్షనేతకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వత్తాసు పలకడం బాధాకరమన్నారు.

Latest Videos

undefined

Also Read:చంద్రబాబు జేబులో మనిషి.. ఈ ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి: కన్నాకు అంబటి సవాల్

టీడీపీ అధినేత దుర్మార్గపు ఆలోచనలకు ఎల్లో మీడియా వంత పాడుతోందని మహేశ్ రెడ్డి ఆరోపించారు. కరోనా టెస్ట్ కిట్లు కొనుగోలు వ్యవహారంలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

దీనిపై కన్నా లక్ష్మీనారాయణ అర్ధరహితమని కాసు మహేశ్ రెడ్డి దుయ్యబట్టారు. ఎటువంటి లోపాలకు తావు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కరోనాపై ముందుకెళ్తోందని ఆయన చెప్పారు.

కోవిడ్ 19పై తీసుకుంటున్న చర్యలకు గాను జగన్ ప్రభుత్వంపై కేంద్రం, జాతీయ మీడియా సంస్థలు ప్రశంసించిన విషయాన్ని కాసు గుర్తుచేశారు. కరోనా టెస్టింగ్ కిట్‌ను రూ.730కి కొంటే... కేంద్రం రూ.790కి కొనుగోలు చేసిందని ఆయన చెప్పారు.

Also Read:విజయసాయి వ్యాఖ్యల వెనుక కుట్ర, విచారణ చేయాలి: కన్నా డిమాండ్

ఈ విషయంపై కన్నా సమాధానం చెప్పాలని మహేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. లక్ష్మీనారాయణ, టీడీపీ నేతలు ఒకే విధంగా విమర్శలు చేస్తున్నారని.. వారిద్దరూ కలిసి ప్రెస్‌మీట్లు పెడితే బాగుంటుందని కాసు సెటైర్లు వేశారు.

ఒకరిపై విమర్శలు చేసే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలని మహేశ్ రెడ్డి హితవు పలికారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని మహేశ్ రెడ్డి వెల్లడించారు.

click me!