గాయకుడిగా మారిన వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ , వీడియో వైరల్

Siva Kodati |  
Published : Oct 24, 2021, 07:16 PM IST
గాయకుడిగా మారిన వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ , వీడియో వైరల్

సారాంశం

నిత్యం రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడిపే వైసీపీ (ysrcp) ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ (karanam dharmasri ) సింగర్‌ అవతారమెత్తారు. మైక్ అందుకుని కో సింగర్‌తో  కలిసి పాట పాడారు.

నిత్యం రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడిపే వైసీపీ (ysrcp) ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ (karanam dharmasri ) సింగర్‌ అవతారమెత్తారు. మైక్ అందుకుని కో సింగర్‌తో  కలిసి పాట పాడారు. వివరాల్లోకి వెళితే.. చోడవరం ఎమ్మెల్యే (chodavaram mla) కరణం ధర్మశ్రీ  రెండో కుమార్తె వివాహం చరణ్ తో వైజాగ్ (vizag) బీచ్ రోడ్డులోని ఎంజీఎం పార్కులో నిన్న ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి వైసీపీ మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

అంగరంగ వైభోగంగా జరిగిన ఈ పెళ్లివేడుకలో అతిథులను అలరించేందుకు పాట కచ్చేరీ కూడా ఏర్పాటు చేశారు. కుమార్తె పెళ్లి సందర్భంగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా మైక్ అందుకుని ఉత్సాహంగా పాటలు పాడారు. ఎన్టీఆర్ ఆల్ టైమ్ హిట్ సాంగ్ ‘‘ నన్ను దోచుకుందువతే వన్నెల దొరసానీ’’ అంటూ ఆలపించి కుటుంబసభ్యులను, పార్టీ నేతలను అందరినీ ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్