ఏపీ: 24 గంటల్లో 127 మందికి కరోనా.. 20,72,651కి చేరిన కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Dec 17, 2021, 08:23 PM IST
ఏపీ: 24 గంటల్లో 127 మందికి కరోనా.. 20,72,651కి చేరిన కేసుల సంఖ్య

సారాంశం

ఏపీలో కొత్తగా 127 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 180 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,814 మంది చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు స్వల్పంగా (corona cases in ap) తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 127 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,72,651కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,477కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల ప్రకాశం, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 180 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,56,416కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 33,050 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,09,28,798కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1758మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 7, చిత్తూరు 32, తూర్పుగోదావరి 8, గుంటూరు 20, కడప 2, కృష్ణ 14, కర్నూలు 0, నెల్లూరు 7, ప్రకాశం 3, శ్రీకాకుళం 3, విశాఖపట్నం 15, విజయనగరం 2, పశ్చిమ గోదావరిలలో 14 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు. 

 

PREV
click me!

Recommended Stories

Markapuram Bus Accident:మార్కాపురంలో ఘోర ప్రమాదం | Chandrababau | Pawan Kalyan | Asianet News Telugu
AP Bus Accident : మార్కాపురం బస్సు యాక్సిడెంట్ లో తప్పెవరిది..? ప్రమాదమని తెలిసీ ప్రయాణమా..?