రఘురామకృష్ణంరాజు Vsవైసీపీ ఎమ్మెల్యేలు: ఎంపీపై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫిర్యాదు

By narsimha lodeFirst Published Jul 9, 2020, 2:11 PM IST
Highlights

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై  భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫిర్యాదు చేశాడు. ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మంత్రి శ్రీరంగనాథరాజు ఫిర్యాదు చేసిన మరునాడే ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడ ఫిర్యాదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకొంది.


ఏలూరు: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై  భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫిర్యాదు చేశాడు. ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మంత్రి శ్రీరంగనాథరాజు ఫిర్యాదు చేసిన మరునాడే ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడ ఫిర్యాదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గత మాసంలో తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు ఎంపీ రఘురామకృష్ణంరాజు దిష్టిబొమ్మలను కొందరు దగ్దం చేశారు. ఈ విషయమై రఘురామకృష్ణంరాజు పోలీసులకు కూడ ఫిర్యాదు చేశాడు.

ఇదిలా ఉంటే గురువారం నాడు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఎంపీపై వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను, తన సహచర ఎమ్మెల్యేలను పందులు అంటూ కించపరిచేలా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా చేసారని గ్రంధి శ్రీనివాస్ ఆరోపించారు.

జిల్లాలోని పోడూరు పోలీస్ స్టేషన్ లో ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మంత్రి శ్రీరంగనాథరాజు బుధవారం నాడు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే నెపంతో రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఒం బిర్లాకు వైసీపీ ఫిర్యాదు చేసింది.

click me!