ప్రభుత్వ ఆస్పత్రికి రూ.5 కోట్లు విలువ చేసే రెండు ఎకరాల భూమిని గ్రంథి శ్రీనివాస్ ఉదారంగా ఇవ్వడంతో నియోజకవర్గం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పలువురు రాజకీయ నాయకులు సైతం గ్రంథి శ్రీనివాస్ ను ప్రసంశలతో ముంచెత్తుతున్నారు.
ఏలూరు: ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించి ప్రాజెక్టు వస్తే అక్కడ నానా హంగామా ఉంటుంది. ఆ ప్రాంతాల్లో ఉండే ప్రజాప్రతినిధులు ముందే భూములు కొనుగోలు చేయడం ఆ తర్వాత రేట్లు పెంచడం వంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కూడా ఇలాంటి ఘటనలే జరిగిందంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రభుత్వ ప్రాజెక్టులోనే నాలుగు డబ్బులు వేనకేసుకోవాలని కొందరు ప్రయత్నించడం మనం చూస్తూనే ఉన్నాం.
undefined
అయితే అందుకు విరుద్ధంగా ప్రజల శ్రేయస్సుకోసం కోట్లాది రూపాయల ఆస్తిని ప్రభుత్వానికి ఇచ్చి తన ఉదారత చాటుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. భీమవరం నియోజకవర్గానికి సీఎం జగన్ 100 పడకల ఆస్పత్రిని మంజూరు చేశారు.
ఏపీ కేబినెట్ సైతం 100 పడకల ఆస్పత్రికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రంగంలోకి దిగారు అధఇకారులు. అయితే ఆస్పత్రి నిర్మాణానికి భూ సేకరణ సమస్యగా మారింది. ఈ వ్యవహారాన్ని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లారు అధికారులు.
భూమి అందుబాటులో లేకపోతే ఆస్పత్రి నిర్మాణం పట్టాలెక్కదని భావించిన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తనకు చెందిన రెండు ఎరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చేశారు. అది కూడా ఉచితంగా ఇవ్వడం విశేషం.
ప్రభుత్వ ఆస్పత్రికి రూ.5 కోట్లు విలువ చేసే రెండు ఎకరాల భూమిని గ్రంథి శ్రీనివాస్ ఉదారంగా ఇవ్వడంతో నియోజకవర్గం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పలువురు రాజకీయ నాయకులు సైతం గ్రంథి శ్రీనివాస్ ను ప్రసంశలతో ముంచెత్తుతున్నారు.
ఇకపోతే గ్రంథి శ్రీనివాస్ 2019 ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. జనసేన పార్టీ అభ్యర్థి పవన్ కళ్యాణ్ పై ఘన విజయం సాధించారు. 3,938 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి వార్తల్లో నిలిచారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గెలవడంతో ఇప్పటికే వార్తల్లో నిలిచారు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. తాజాగా భూమిని దానం చేయడంతో మరోసారి హల్ చల్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పై ప్రసంశలు ముంచెత్తుతున్నాయి.