పవన్ ప్యాకేజ్ డబ్బులు రూ.1400 కోట్లు.. ఎప్పుడో దేశం దాటాయి : ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Oct 7, 2023, 6:44 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. తనకు తెలిసి ప్యాకేజీ ద్వారా వచ్చిన రూ.1400 కోట్లు హవాలా మార్గంలో దేశం దాడిపోయాయని చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.


జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. శనివారం ఆయన కాకినాడలో మీడియాలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కచ్చితంగా ప్యాకేజీ కళ్యాణేనంటూ చురకలంటించారు. ఆయనను బీజేపీని కాదని బయటకు రమ్మనండి అంటూ సవాల్ విసిరారు. పవన్ ప్యాకేజీ సొమ్ములు ఏ మార్గంలో విదేశాలకు వెళ్లాయో తప్పకుండా బయటకు వస్తాయని ద్వారంపూడి వ్యాఖ్యానించారు.

తనకు తెలిసి ప్యాకేజీ ద్వారా వచ్చిన రూ.1400 కోట్లు హవాలా మార్గంలో దేశం దాడిపోయాయని చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సొమ్ములు దుబాయ్, రష్యా, సింగపూర్‌కు వెళ్లాయో తెలియడం లేదన్నారు. పవన్ కళ్యాణ్‌కు దమ్ముంటే తనపై గ్లాస్ గుర్తును పోటీకి పెట్టాలని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. 

Latest Videos

ALso REad: వైఎస్సార్‌పై పోరాడావా , చిరంజీవికైనా తెలుసా .. కేసీఆర్‌ కోసమే తెలంగాణలో పోటీ : పవన్‌పై పేర్నినాని విమర్శలు

ఇకపోతే.. మాజీ మంత్రి పేర్ని నాని నిన్న మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో పవన్ ఆటవిడుపు యాత్ర చేశారంటూ సెటైర్లు వేశారు. బీజేపీ కంటే , అన్నయ్య కంటే కూడా చంద్రబాబే తనకు ముఖ్యమని పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పారని నాని దుయ్యబట్టారు. జగన్‌కు దమ్ముంది కాబట్టే ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా గెలిచారని ఆయన తెలిపారు. వైఎస్ఆర్‌ను పవన్ ఎప్పుడు ఎదిరించారని పేర్నినాని ప్రశ్నించారు. వైఎస్సార్‌పై నువ్వు పోరాటం చేసినట్లు కనీసం చిరంజీవికైనా తెలుసా అని ఆయన నిలదీశారు. మా తమ్ముడు వైఎస్‌పై పోరాటం చేశారని చిరంజీవి దగ్గర నుంచి సర్టిఫికెట్ తీసుకురావాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. 

నిన్నూ ఎవరూ ఏమనకూడదు.. నువ్వు మాత్రం అందరినీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడతావని ఆయన దుయ్యబట్టారు. ఏపీలో ఆధార్ , ఇల్లు, కాపురం వుందా.. ఎన్నిసార్లు పాస్‌పోర్ట్ తీసుకున్నారని పేర్ని నాని సెటైర్లు వేశారు. ఒకసారి ఎన్డీయేలో వున్నానంటావు, మరోసారి ఎన్డీయేలో లేను అంటావు అంటూ ఆయన ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఆదేశాలతోనే తెలంగాణలో 32 స్థానాల్లో జనసేన పోటీకి సిద్ధమైందని పేర్ని నాని ఆరోపించారు. ఏపీలో కాపులు వున్న చోట వారాహి తిరిగినట్లే.. తెలంగాణలోనూ మున్నూరు కాపులు వున్న నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని ఆయన దుయ్యబట్టారు. 
 

click me!