పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా.. చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్

Siva Kodati |  
Published : Feb 22, 2023, 02:35 PM IST
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా.. చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్

సారాంశం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. పోర్టుల్లో పీడీఎస్ రైస్ వెళ్తుందని నిరూపిస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని ఆయన సవాల్ విసిరారు.   

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వైసీపీ సీనియర్ నేత, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. పోర్టుల్లో పీడీఎస్ రైస్ వెళ్తుందని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. నిరూపించకపోతే లోకేష్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని ద్వారంపూడి పేర్కొన్నారు.  నీ కొడుకు ఎక్కడ పోటీ చేసినా గెలవడని.. దమ్ముంటే చంద్రబాబు తన సవాల్‌ను స్వీకరించాలని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. పోర్టుల అభివృద్ధిని చంద్రబాబు చూడలేకపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 

ALso REad: దూకుడు పెంచిన వైకాపా-తగ్గేదేలే అంటున్న టీడీపీ.. జగన్ కొత్త‌ కాన్సెప్ట్‌ను ఫాలో అవుతున్న చంద్రబాబు !

ఇకపోతే.. ఆంధ్ర‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లకు ఇంకా ఏడాదికి పైగా స‌మ‌యముంది. అయితే, రాష్ట్రంలోని అన్ని రాజ‌కీయ‌ పార్టీలు ఇప్ప‌టినుంచే ఎన్నిక‌ల వ్యూహాలు ర‌చిస్తూ ముందుకు సాగుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌రోసారి విజ‌యం సాధించాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలోని అధికార వైఎస్ఆర్సీపీ ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డానికి ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. ఇదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలోని తెలుగు దేశం పార్టీ (టీడీపీ) సైతం రానున్న ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. అయితే, ప్రస్తుతం ఇంటింటి ప్ర‌చారం కోసం ఇప్ప‌టి నుంచే ఈ రెండు పార్టీలు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసుకోవ‌డంతో రాష్ట్ర రాజ‌కీయాలు హీటెక్కుతున్నాయి. ఆస‌క్తిక‌రంగా అధికార పార్టీకి చెక్ పెట్ట‌డానికి ఆ పార్టీ అనుస‌రిస్తున్న వ్యూహాల‌ను ప్ర‌తిప‌క్ష పార్టీ కూడా ఫాలో అవుతోంది.

జగనన్నే మా భవిష్యత్తు ప్రచారం.. 

2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైకాపా అధ్యక్షుడు, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తన పార్టీ శ్రేణులను క్రియాశీల ఎన్నికల మూడ్ లోకి తీసుకొచ్చారు. ఇటీవ‌ల జ‌రిగిన పార్టీ స‌మావేశంలో ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టి నుంచే సిద్ధం కావాల‌నీ, 'జగనన్నే మా భవిష్యతు' ప్రచారాన్ని ముందుకు తీసుకువ‌చ్చారు. ఇంటింటి ప్ర‌చారం కోసం 50 కుటుంబాలకు 'గృహ సారధి' ద్వారా 'మైక్రో పోల్ మేనేజ్మెంట్' అమలు చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో అధికార వైకాపా ప్ర‌జ‌ల సంక్షేమం, అమ‌లు చేస్తున్నే ప‌థ‌కాలు, ఇంతకు ముందు ప్ర‌భుత్వాల వైఫ‌ల్యాను ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌నున్నారు. 

అదే బాట‌లో తెలుగుదేశం..  

ఆస‌క్తిక‌రంగా జ‌గ‌న్ ను అనుస‌రిస్తూ  తెలుగు దేశం పార్టీ సైతం ఇదే త‌ర‌హా వ్యూహాల‌తో అధికార పార్టీకి చెక్ పెట్టాలని చూస్తోంది. టీడీపీ 30 కుటుంబాల చొప్పున సదికార సారధులతో వైకాపా త‌ర‌హా వ్యూహ అమలుకు సిద్ధ‌మైంది. అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికల్లోనూ ప్రతి ఓటును విలువైనదిగా, కీలకమైనదిగా పరిగణిస్తూ ఓటర్లకు చేరువయ్యేందుకు వైసీపీ, టీడీపీలు ముందుగానే ఎన్నిక‌ల రేసును ప్రారంభించాయి. ఇవి ఒకేసారి జరుగుతాయని భావిస్తున్నప్పటికీ ఏపీలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్