వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ ఇంట్లో ఆస్తి గొడవలు.. బావమరిది ఆత్మహత్యాయత్నం

Siva Kodati |  
Published : Dec 03, 2022, 09:27 PM IST
వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ ఇంట్లో ఆస్తి గొడవలు.. బావమరిది ఆత్మహత్యాయత్నం

సారాంశం

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి బావమరిది శ్రీధర్ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఆస్తి కోసం గొడవలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.   

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుటుంబంలో వివాదాలు ముదిరాయి. ఆస్తి విషయంగా ఎమ్మెల్యేకు, ఆయన బావమరిది మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయి. పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి సమీపంలో వున్న రెండెకరాల భూమి విషయంలో వివాదం రచ్చకెక్కింది. ఎమ్మెల్యే ఇంటి దగ్గర పోలంలో బోరు వేసేందుకు బావమరిది శ్రీధర్ రెడ్డి ప్రయత్నించారు. ఆయన్ను ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల ముందే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు శ్రీధర్ రెడ్డి. వైద్యం చేయించుకునేందుకు కూడా నిరాకరించారు. దీంతో ఎమ్మెల్యే ఇంటి వద్ద పోలీసులు భారీగా బందోబస్త్ ఏర్పాటు చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu