టికెట్లు వుంటేనే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం.. ఈసారి స్ట్రిక్ట్‌గా : తేల్చిచెప్పిన టీటీడీ

By Siva KodatiFirst Published Dec 3, 2022, 5:25 PM IST
Highlights

వైకుంఠ ద్వార దర్శనం విషయంలో విమర్శలు వస్తుండటంతో టీటీడీ ఈసారి కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. టికెట్లు వున్న భక్తులకే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తాని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 

టికెట్లు వున్న భక్తులకే తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని చెప్పింది టీటీడీ . మొత్తం ఏడున్నర లక్షల మందికి అవకాశం వుంటుందని వెల్లడించింది. పదిరోజుల పాటు శ్రీవారి ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తామని తెలిపింది. జనవరి 2 నుంచి 11 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు వుంటాయని స్పష్టం చేసింది. రోజుకు 25 వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ టికెట్లు జారీ చేస్తామని.. తిరుపతిలోని 9 ప్రాంతాల్లో రోజుకు 50 వేల చొప్పున సర్వ దర్శన టికెట్లు జారీ చేస్తామని వెల్లడించింది. శ్రీవారి ట్రస్ట్ దాతలకు ఆన్‌లైన్ ద్వారా టికెట్లు జారీ చేస్తామని.. మహాలఘు ద్వారానే అందరికీ స్వామివారి దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అలాగే డిసెంబర్ 29 నుంచి జనవరి 3 వరకు తిరుమలలో అడ్వాన్స్ గదుల బుకింగ్‌ను నిలిపివేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భక్తులకు సీఆర్‌వో వద్దనే గదులు కేటాయిస్తామని ధర్మారెడ్డి పేర్కొన్నారు. 
 

click me!