
వైసీపీ చేస్తోన్న అభివృద్ధిని చూసి టీడీపీ (tdp) ఓర్వలేకపోతోందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు (ambati rambabu) . ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానులను తెలుగుదేశం పార్టీ (telugu desam party) కేసులు వేసి అడ్డుకుంటోందని రాంబాబు మండిపడ్డారు. గోవా కల్చర్‌ను గుడివాడకు (gudivada) తీసుకొచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంబటి ఎద్దేవా చేశారు. నిజనిర్ధారణ (tdp fact finding committee ) పేరుతో టీడీపీ నేతలు దాడికి వెళ్లారని రాంబాబు ఆరోపించారు. టీడీపీ అధికారంలో వున్నప్పుడు క్లబ్బులు పెట్టలేదా అని అంబటి ప్రశ్నించారు. 365 రోజులు పేకాట ఆడించలేదా అని ఆయన మండిపడ్డారు. క్లబ్బులు నడిపిన సంస్కృతి చంద్రబాబుదని (chandrababu naidu) రాంబాబు దుయ్యబట్టారు.
కాగా.. ఈ క్యాసినో సెంటర్ నిర్వహణ విషయమై టీడీపీ నేతలు శుక్రవారం నాడు నిజ నిర్ధారణ చేయడానికి గుడివాడకు వచ్చారు. క్యాసినో నిర్వహించిన కే కన్వెన్షన్ సెంటర్ వద్ద వైసీపీ శ్రేణులు భారీగా మోహరించాయి. టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు మోహరించారు. టీడీపీ కార్యాలయం నుండి కె కన్వెన్షన్ సెంటర్ వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు.
casino నిర్వహించిన కె కన్వెన్షన్ సెంటర్ వద్దకు టీడీపీ నేతలు వెళ్లకుండా అడ్డుకొన్నారు. రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేసి టీడీపీ నేతలు నిలువరించారు.అయితే ఈ సమయంలో టీడీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. టీడీపీ కార్యాలయం వెనుక నుండి వైసీపీ శ్రేణులు భారీగా వచ్చారు. దీంతో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. వైసీపీ శ్రేణులు కుర్చీలు, రాళ్లతో దాడి వేశారు. వైసీపీ శ్రేణులను టీడీపీ శ్రేణులను ప్రతిఘటించేందుకు ప్రయత్నించారు,. అదే సమయంలో అక్కడే ఉన్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు లాఠీచార్జీ చేశారు. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు కారును వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశాయిటీడీపీ కార్యాలయం వద్ద నుండి వైసీపీ శ్రేణులను పంపించి వేశారు.