ఎన్టీఆర్ మద్యపానం నిషేధిస్తే చంద్రబాబునాయుడు మద్యపానాన్ని ఎత్తివేశారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. దేశంలో మద్యం విక్రయాలకు కేంద్రమే అనుమతి ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.
అమరావతి: ఎన్టీఆర్ మద్యపానం నిషేధిస్తే చంద్రబాబునాయుడు మద్యపానాన్ని ఎత్తివేశారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. దేశంలో మద్యం విక్రయాలకు కేంద్రమే అనుమతి ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.
మంగళవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. దశలవారీగా మద్యాన్ని నిషేధిస్తంచడమే తమ విధానమని ఆయన గుర్తు చేశారు. ఈ కారణంగానే మద్యం ధరలు పెంచినట్టుగా ఆయన చెప్పారు.
undefined
also read:ఆధార్ కార్డు, గొడుగు ఉంటేనే మద్యం విక్రయాలు: తెనాలి పోలీసుల వెరైటీ నిబంధన
లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్రం వ్యవసాయం, లిక్కర్ అమ్మకాలకు అనుమతి ఇచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతులతోనే మద్యం విక్రయాలు జరిపితే బాబు రాద్దాంతం చేస్తున్నారన్నారు.
లిక్కర్ అమ్మకాలపై నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు, టీడీపీ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.ప్రజలు మర్చిపోతారనే ఉద్దేశ్యంతో చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారన్నారు.