కోడెల మరణాన్ని పొలిటికల్ సేల్ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం: వైసీపీ ఎమ్మెల్యే అంబటి ఫైర్

By Nagaraju penumalaFirst Published Sep 20, 2019, 4:56 PM IST
Highlights

పరీక్ష పేపర్ లీకై ఉంటే అప్పుడే పత్రికల్లో రాయోచ్చు కదా అని నిలదీశారు. పరీక్ష ఫలితాలు విడుదలైన తర్వాత పేపర్ లీకయ్యిందంటూ ప్రభుత్వం ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాశాయని ఆరోపించారు ఎమ్మెల్యే అంబటి రాంబాబు. 

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యను చంద్రబాబు నాయుడు రాజకీయం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. 

కోడెల మరణాన్ని పొలిటికల్ సేల్ చేద్దామని మాజీ సీఎం చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. కోడెల అంతిమయాత్రలో చంద్రబాబు ముఖంలో భావోద్వేగం ఎక్కడా కనిపించలేదన్నారు. అందరికీ రెండు వేళ్లు చూపిస్తూ రాజకీయ లబ్ధి పొందేలా ప్రయత్నించారని అంబటి రాంబాబు ఆరోపించారు. 

గ్రామసచివాలయం పేపర్ లీకైందన్న వార్తలు నమ్మెుద్దు: అంబటి విజ్ఞప్తి 

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అంత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రామవార్డు, సచివాలయం ఉద్యోగాలు ఎంతో పారదర్శకంగా జరిగాయని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయం ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష పేపర్ లీకైందంటూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు చెందిన పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 

పరీక్ష పేపర్ లీకై ఉంటే అప్పుడే పత్రికల్లో రాయోచ్చు కదా అని నిలదీశారు. పరీక్ష ఫలితాలు విడుదలైన తర్వాత పేపర్ లీకయ్యిందంటూ ప్రభుత్వం ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాశాయని ఆరోపించారు ఎమ్మెల్యే అంబటి రాంబాబు. 

గ్రామ వార్డు, సచివాలయం ఉద్యోగాలకు సంబంధించి ప్రశ్నాపత్రాలు ఎక్కడా లీక్ అవ్వలేదన్నారు. గతంలో కూడా రూ.5 లక్షలకు పేపర్ కొనుగోలు చేశారంటూ తప్పుడు కథనాలు ప్రచారం చేశాయని గుర్తు చేశారు. 

గ్రామ వార్డు, సచివాలయం ఉద్యోగాలను వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిందని తెలిపారు. అందులో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదన్నారు. యువత ఇలాంటి పిచ్చి రాతలను నమ్మెద్దని సూచించారు. 

సచివాలయంలో పని చేసే ఉద్యోగుల బంధువులు మెరిట్ వస్తే వారు పేపర్ లీక్ చేసినట్లేనా అని నిలదీశారు. అత్యధిక శాతం మెరిట్ సాధించిన వారంతా సాధారణ కుటుంబాలకు చెందిన అభ్యర్థులేనని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. 

ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంతో తట్టుకోలేక చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు నారా లోకేష్ ఆయన పత్రికలు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నాయని వారికి యువతే తగిన గుణపాఠం చెప్తారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు హెచ్చరించారు. 


 

click me!