జగన్ ఆశలు నెరవేరేనా..: సీబీఐ కోర్టు కీలక నిర్ణయం

Published : Sep 20, 2019, 04:26 PM IST
జగన్ ఆశలు నెరవేరేనా..: సీబీఐ కోర్టు కీలక నిర్ణయం

సారాంశం

గతంలో హైకోర్టు జగన్ మినహాయింపు పిటీషన్ ను కొట్టివేసినందున మళ్లీ ఇప్పుడు ఎలా విచారణ చేపడతామని సీబీఐ కోర్టు ప్రశ్నించింది.మారిన పరిస్థితుల నేపథ్యంలో  విచారణ చేపట్టవచ్చని జగన్‌ తరపు న్యాయవాది కోర్టుకు సూచించారు. 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై సీబీఐ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యే విషయంలో తనకు మినహాయింపు ఇవ్వాలంటూ సీఎం జగన్ సీబీఐ కోర్టును ఆశ్రయించారు. 

ఈనెల 5న సీబీఐ కోర్టులో జగన్ పిటీషన్ దాఖలు చేశారు. జగన్ పిటీషన్ పై శుక్రవారం సీబీఐ కోర్టులో విచారణ జరిపింది. గతంలో హైకోర్టు జగన్ మినహాయింపు పిటీషన్ ను కొట్టివేసినందున మళ్లీ ఇప్పుడు ఎలా విచారణ చేపడతామని సీబీఐ కోర్టు ప్రశ్నించింది. 

మారిన పరిస్థితుల నేపథ్యంలో  విచారణ చేపట్టవచ్చని జగన్‌ తరపు న్యాయవాది కోర్టుకు సూచించారు. రాష్ట్రముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలనా వ్యవహారాలు చూడాల్సి ఉన్నందున తనకు మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ కోరిన సంగతి తెలిసిందే. అయితే తనకు బదులు తన తరపున తన న్యాయవాది హాజరయ్యేలా అనుమతి మంజూరు చేయాలని పిటీషన్లో జగన్ కోరారు. 

ఇకపోతే గత ఏడాది మార్చి 25న సీబీఐ కోర్టు విచారణకు మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరిన సంగతి తెలిసిందే. పాదయాత్ర చేపడుతున్న తరుణంలో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరగా ఆనాడు సీబీఐ కొట్టివేసిన సంగతి తెలిసిందే. 

ఈ వార్తలు కూడా చదవండి

సీబీఐ కోర్టులో సీఎం జగన్ పిటీషన్

ఆస్తుల కేసులో సీఎం జగన్ కు ఊరట: ఆస్తులు తిరిగి ఇచ్చేయాలని ఈడీకి ట్రిబ్యునల్ ఆదేశం

PREV
click me!

Recommended Stories

Mukkoti Ekadashi Celebrations: నెల్లూరు లో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు| Asianet News Telugu
తిరుమల వైకుంఠ ద్వార దర్శనంచేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu