నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకొంటా: ఆళ్ల సంచలనం

By narsimha lode  |  First Published Jan 3, 2020, 10:41 AM IST

రాజధానిలో తనకు భూములు ఉన్నాయని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకొంటానని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి  స్పష్టం చేశారు. 


అమరావతి: రాజధాని ప్రాంతంలో తనకు భూములు ఉన్నట్టుగా నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకొంటానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు.

శుక్రవారం నాడు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.  అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని తమ పార్టీ సాక్ష్యాలతో నిరూపించిన  విషయాన్ని గుర్తించారు.

Latest Videos

రాజధానిలో  తనకు భూములున్నట్టుగా నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని సమీపంలోని నీరుగొండ గ్రామంలో తనకు ఐదు ఎకరాల భూమి ఉన్నట్టుగా నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. 

Also read:రాజధాని రచ్చ: 29 గ్రామాల్లో సకల జనుల సమ్మె

తనకు రాజధాని ప్రాంతంలో భూములు ఉన్నట్టుగా నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకొంటానని ఆయన స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబునాయుడు ఒక్క శాశ్వత భవనాన్ని నిర్మించాడా అని ఆయన ప్రశ్నించారు.

Also read:బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ నివేదిక సిద్దం: అమరావతిపై జగన్ సర్కార్ తాడోపేడో

రాజధాని పరిసర ప్రాంతాల్లో  టీడీపీకి చెందిన నేతలు, ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులకు భూములు ఉన్నాయని ఆయన ఆరోపించారు.   ఈ విషయం బయటకు రావడంతో చంద్రబాబునాయుడుకు దిక్కుతోచడం లేదన్నారు.

రాజధాని ప్రాంతంలో చంద్రబాబునాయుడు వేల కోట్లను దోచుకొన్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. భూముల సేకరణ కోసం చంద్రబాబునాయుడు ప్రభుత్వం రైతుల నుండి బలవంతంగా భూములను సేకరించిందని ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు.చంద్రబాబునాయుడు తన బినామీ పవన్ కళ్యాణ్‌ను రాజధాని ప్రాంతంలో తిప్పుతున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. 

click me!