బాబుకు షాక్: ఓటుకు నోటు కేసుపై ఆళ్ల మరో పిటిషన్

By narsimha lodeFirst Published Nov 2, 2018, 1:12 PM IST
Highlights

ఓటుకు నోటు కేసును త్వరగా విచారించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శుక్రవారం నాడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.


న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసును త్వరగా విచారించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శుక్రవారం నాడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.ఫిబ్రవరిలో ఈ కేసును లిస్ట్ చేసి విచారణ చేస్తామని సుప్రీంకోర్టు  ప్రకటించింది.

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో  ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తూ అప్పటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. అయితే తనను ఈ కేసులో ఉద్దేశ్యపూర్వకంగా ఇరికించారని రేవంత్ రెడ్డి  ఆరోపణలు చేశారు.

ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు కూడ సంబంధాలు ఉన్నాయని ఇటీవల ఎన్నికల సభల్లో  తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఈ తరుణంలో  సుప్రీంకోర్టులో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు లంచాలు ఇచ్చేందుకు ప్రయత్నించారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు.

 అయితే రాజకీయ శతృత్వం కారణంగానే చంద్రబాబునాయుడుపై ఈ పిటిషన్ దాఖలు చేశారని  ఏపీ సీఎం తరపు న్యాయవాది సిద్దార్ధ సుప్రీంకోర్టుకు చెప్పారు. గతంలో కూడ ఈ కేసు విచారణ విషయమై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి  సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను  ఫిబ్రవరికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.


 

click me!