వచ్చే రెండేళ్లకు రోడ్ మ్యాప్: జగన్ అధ్యక్షతన వైసీపీ శాసనసభపక్షం భేటీ

By narsimha lode  |  First Published Mar 15, 2022, 4:24 PM IST


వచ్చే రెండేళ్లకు రోడ్ మ్యాప్ తయారు చేసేందుకు వీలుగా వైసీపీ శాసనసభపక్షం జరిగింది. సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ శాసనసభపక్షం భేటీ అయింది.



అమరావతి: YCP శాసనసభపక్ష సమావేశం మంగళవారం నాడు మధ్యాహ్నం ప్రారంభమైంది. సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ శాసనసభపక్షసమావేశం జరుగుతుంది.వచ్చే రెండేళ్లకు రోడ్ మ్యాప్ ను సిద్దం చేసుకొనేందుకు గాను ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులకు జగన్ దిశా నిర్ధేశం చేయనున్నారు.

దాదాపు మూడేళ్ల తర్వాత వైసీపీ శాసనసభపక్ష సమావేశం ఇవాళ జరుగుతుంది. YS Jagan ను సీఎంగా ఎన్నుకోవడం కోసం వైసీపీ శాసనసభపక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం జరిగిన తర్వాత ఇంతవరకు వైసీపీ శాసనసభపక్ష సమావేశం జరగలేదు. ఇవాళ వైసీపీ శాసనసభపక్ష సమావేశాన్ని నిర్వహస్తున్నారు. వచ్చే రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికలకు పార్టీని సన్నద్దం చేయడం కోసం జగన్ ఇప్పటి నుండే సన్నాహలు చేసుకొంటున్నారు. Cabinetలో కూడా మార్పులు చేర్పులు చేయనున్నారు.

Latest Videos

గత Cabinet సమావేశంలోనే మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ గురించి సీఎం జగన్ మంత్రులకు సంకేతాలు ఇచ్చారు. పనితీరు ఆధారంగా మంత్రులను కేబినెట్ లో కొనసాగించనున్నారు. కొత్త వారికి కూడా  ఛాన్స్ ఇవ్వనున్నారు.

ఈ నెల 27వ తేదీన జగన్ మంత్రివర్గంలో ఉన్న కొందరు మంత్రులు రాజీనామా చేసే అవకాశం ఉంది. ఉగాది రోజున కేబినెట్ పునర్వవ్యవస్థీకరణ కోసం మంత్రుల రాజీనామా చేయనున్నారని సమాచారం.

ప్రస్తుతం ఉన్నట్టుగా ఐదుగురు డిప్యూటీ సీఎంలు కూడా ఉండనున్నారు. ప్రస్తుతం ఆయా సామాజిక వర్గానికి చెందిన ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. కేబినెట్ పునర్వవ్వస్థీకరణలో కూడా ఐదు డిప్యూటీ సీఎంలను కొనసాగించనున్నారు. మరో వైపు మహిళలకు కూడా మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. హోం మంత్రిగా సుచరితను కొనసాగించే అవకాశాలు లేకపోలేదు.

రెండున్నర ఏళ్ల తర్వాత కేబినెట్ పునర్వవ్వయస్థీకరిస్తామని జగన్ గతంలోనే ప్రకటించారు. అయితే ప్రస్తుతం మంత్రుల్లో పని తీరు ఆధారంగా కేబినెట్ లో మార్చులు చేర్పులు కొనసాగించనున్నారు. కొందరిని పార్టీ సేవలకు ఉపయోగించుకోనున్నారు. 2024 లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు పార్టీని సిద్దం చేయడం కోసం జగన్ సర్కార్ టీమ్ ను సిద్దం చేసుకొంటున్నారు. ఇందులో భాగంగానే మంత్రి వర్గాన్ని పునర్వవ్యవస్థీకరించనున్నారు. మరో వైపు పార్టీ కోసం పనిచేసే వారికి కీలక బాధ్యతలను అప్పగించనున్నారు. 

ఈ ఏడాది జూన్ మాసంలో ప్రశాంత్ కిషోర్ టీమ్ కూడా రంగంలోకి దిగనుంది. దీంతో ఈ టీమ్ రంగంలోకి వచ్చే సయమానికి కేబినెట్ పునర్వవ్యవస్థీకరణతో పాటు పార్టీలో మార్పులు చేర్పులకు కూడా  చేయాలని జగన్ భావిస్తున్నారు.

గత వారంలో జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు సంబంధించి కూడా సీఎం జగన్ సంకేతాలు ఇచ్చారు. ఇవాళ జరిగే పార్టీ శాసనసభపక్ష సమావేశంలో ఈ విషయమై స్పష్టత ఇవ్వనున్నట్టుగా తెలిపారు. మరో వైపు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి వస్తే మీరే మంత్రులు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరిని పక్కన పెడతారు, ఎవరిని కొనసాగిస్తారనే విషయమై ఉత్కంఠ నెలకొంది. న్నికలకు టీమ్ ను తయారు చేసుకొంటున్న జగన్ శాసనసభపక్ష సమావేశంలో  పార్టీ నేతలకు కీలక సూచనలు చేసే అవకాశం లేకపోలేదు.

 

 

click me!