పెద్దిరెడ్డిపై ఆదేశాలు.. ఎస్ఈసీని ఎర్రగడ్డలో చేర్చాలి: నిమ్మగడ్డపై వైసీపీ నేతల విమర్శలు

By Siva KodatiFirst Published Feb 6, 2021, 4:03 PM IST
Highlights

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జారీ చేసిన హౌస్ అరెస్ట్ ఆదేశాలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఎస్ఈసీ వివాదాస్పదంగా మాట్లాడుతున్నారని ఫైరయ్యారు ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాని గోవర్థన్ రెడ్డి.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జారీ చేసిన హౌస్ అరెస్ట్ ఆదేశాలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఎస్ఈసీ వివాదాస్పదంగా మాట్లాడుతున్నారని ఫైరయ్యారు ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాని గోవర్థన్ రెడ్డి.

మంత్రి పెద్దిరెడ్డిని నిలువరించాలనుకోవడం అప్రజాస్వామికమని ఎద్దేవా చేశారు. ఈ వాచ్ యాప్‌ను తీసుకొచ్చిన నిమ్మగడ్డను కోర్టు తప్పుపట్టిందని.. పెద్దిరెడ్డిపై ఆదేశాలు వెనక్కి తీసుకోకపోతే న్యాయపోరాటానికి వెళ్తామని కాకాని హెచ్చరించారు.

శాంతి సామరస్యంగా జరిగే ఏకగ్రీవాలను నిలిపివేయాలనుకోవడం మంచి పద్దతి కాదని గోవర్థన్ రెడ్డి హితవు పలికారు. ఇక పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ మాట్లాడుతూ... పెద్దిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు.

Also Read:మంత్రి పెద్దిరెడ్డి ఇంటికే పరిమితం: నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన ఆదేశాలు

నిమ్మగడ్డను ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్చాలని... ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతుంటే పెద్దిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయమని ఆదేశాలివ్వడం సరికాదని జోగి రమేశ్ హితవు పలికారు.

ఎస్ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఏపీలో పంచాయతీ ఎన్నికలు హాట్ హాట్‌గా సాగతున్న సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ వర్సెస్ జగన్ సర్కార్ అన్నట్లుగా నడుస్తున్న ఈ వ్యవహారంలో శనివారం ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

తనను టార్గెట్‌ చేస్తూ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్జి చేస్తున్న వ్యాఖ్యలపై ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ .. ఇప్పుడు ఆయన్ను ఏకంగా హౌస్‌ అరెస్ట్‌ చేయాలని డీజీపీకి ఆదేశాలు పంపారు. ఎన్నికల్లో ఏకగ్రీవాలకు సంబంధించి పెద్దిరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలే ఇందుకు కారణం.

click me!