పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. గవర్నర్ ఉన్నాడన్న నమ్మకం కలిగించాలి... : వర్లరామయ్య

By AN TeluguFirst Published Feb 6, 2021, 3:25 PM IST
Highlights

మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు, నిన్నపాత్రికేయులతో ఆయన మాట్లాడిన తీరు గర్హనీయమని, రాజ్యాంగాన్ని గౌరవిస్తానని, పరిరక్షిస్తానని, రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని ప్రమాణం చేసినవ్యక్తి, నేడు రాజ్యాంగంపై కించిత్ కూడా గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నాడని టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. 

మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు, నిన్నపాత్రికేయులతో ఆయన మాట్లాడిన తీరు గర్హనీయమని, రాజ్యాంగాన్ని గౌరవిస్తానని, పరిరక్షిస్తానని, రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని ప్రమాణం చేసినవ్యక్తి, నేడు రాజ్యాంగంపై కించిత్ కూడా గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నాడని టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. 

శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అజ్ఞానంతో, అహంకారంతో ప్రవర్తిస్తున్న మంత్రి , జిల్లా కలెక్టర్లను, అధికారులను బెదిరించాడని, ఎస్ఈసీ ఆదేశాలు అమలుచేస్తే, మేం అధికారంలో ఉన్నంతవరకు అటువంటి అధికారులను బ్లాక్ లిస్ట్ లోపెడతానని హెచ్చరించడం ద్వారా నేరపూరితంగా, నేరస్తుడిలా, క్రిమినల్ మనస్తత్వంతో మాట్లాడాడన్నారు.  

అధికారులకు భవిష్యత్ లేకుండా చేస్తానని పెద్దిరెడ్డి చెప్పకనే చెప్పాడన్నారు. రాజ్యాంగబద్ధంగా నడుచుకునే స్వతంత్ర సంస్థను ఛాలెంజ్ చేస్తున్నట్లుగా పెద్దిరెడ్డి వ్యాఖ్యలున్నాయని, తద్వారా అతను రాజ్యాంగానే ఛాలెంజ్ చేశాడని రామయ్య తేల్చిచెప్పారు. ఎన్నికల కమిషన్ అనేది రాజ్యాంగబద్ధసంస్థ అని, అటువంటి సంస్థ మాటలు వినవద్దని అధికారులకు చెప్పేఅధికారం మంత్రి అయినంత మాత్రాన పెద్దిరెడ్డికి ఎక్కడినుంచి వచ్చిందని రామయ్య ప్రశ్నించారు. 

జిల్లాకలెక్టర్ల, పోలింగ్ సిబ్బంది, ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులను బెదిరించేలా మాట్లాడినందుకు డీజీపీ సవాంగ్ తక్షణమే మంత్రిపెద్దిరెడ్డిని అరెస్ట్ చేయాలన్నారు. ఐఏఎస్ అధికారులంటే ఆషామాషీగా వచ్చినవారు కాదని, వారేమీ పెద్దిరెడ్డిలా అవినీతిమార్గంలో పదవుల్లోకి వచ్చినవారు కారన్నారు. 

మంత్రి అయినంతమాత్రాన అధికారులను బ్లాక్ లిస్ట్ లో పెడతానని చెప్ప డం ద్వారా రాజ్యాంగవ్యవస్థకు వ్యతిరేకంగా నడవమని వారికిచెప్పా డన్నారు.  రాష్ట్రంలో రాజ్యాంగసంక్షోభానికి తెరతీయాలనే ఉద్దేశం మంత్రివ్యాఖ్యల్లో కనిపిస్తోందన్నారు. 

సవాంగ్ పై ఇప్పటివరకు ఉన్న  అపప్రదలన్నీ తొలగిపోయే మంచి అవకాశం ఇప్పుడొచ్చిందన్న రామయ్య, అసమర్థపోలీస్ అధికారిగా ప్రజలందరూ భావిస్తున్న తరుణంలో, మంత్రిని అరెస్ట్ చేయడం ద్వారా ఆయన తన సమర్థతను నిరూపించుకోవాలన్నారు. 

పెద్దిరెడ్డి లాంటి ప్రమాదకర వ్యక్తులను, రాజ్యాంగాన్ని తలవెంట్రుకతో సమానంగా చూసిన వ్యక్తి బయటతిరగకుండా చూడాలన్నారు.  కలెక్టర్లంటే జిల్లా న్యాయాధి కారులని, అటువంటివారిని బెదిరించేలా మాట్లాడినందుకు, తానుచేసిన ప్రమాణాన్ని తప్పానని, చెంపలేసుకొని  తనతప్పుని పెద్దిరెడ్డే స్వయంగా కోర్టుల్లో ఒప్పకోవాలన్నారు. అప్పటివరకు అతను బయటకు రాకుండా చూడాలన్నారు. 

రాజ్యాంగాన్ని ఐఏఎస్ అధికారులెవరూ లెక్కచేయవద్దు, అలా చేస్తే బ్లాక్ లిస్ట్ లో పెడతానని బెదిరిస్తుంటే ఐఏఎస్ అధికారుల సంఘం ఏం చేస్తోందని, తోటి అధికారులంతా మంత్రి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయరా అని రామయ్య ప్రశ్నించారు. 

పెద్దిరెడ్డి లాంటి వ్యక్తి కేబినెట్ లో ఉండటానికి వీల్లేదని ముఖ్యమంత్రికి చెప్పాల్సిన బాధ్యత ఐఏ ఎస్ అధికారుల సంఘానికి లేదా అన్నారు.పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై తాము గవర్నర్ కు ఫిర్యాదు చేశామని, అతన్ని వెంటనే మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశామన్నారు. 

గవర్నర్ ఈ రాష్ట్రంలో ఉన్నాడనే నమ్మకం ప్రజలకు కలిగేలా ఆయన వ్యవహరించాలని, అందులో భాగంగా వెంటనే మంత్రిపెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని తాము కోరడం జరిగిందన్నారు. డీజీపీ తక్షణమే పెద్దిరెడ్డిని అరెస్ట్ చేసి, కస్టడీకి పంపాలని, ఐఏఎస్ అధికారుల సంఘం, తోటి కలెక్టర్లంతా రాజ్యాంగంప్రకారం నడుచుకోవాలని వారికి ఆదేశాలివ్వాలన్నారు. 

ఎస్ఈసీ, మంత్రిపెద్దిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయాలని మాత్రమే చెప్పారని, రాజ్యాంగ వ్యతిరేక ఆలోచనలు ఉన్న వ్యక్తి బాహ్యప్రపంచంలో, మంత్రిమండలిలో ఉండటానికి వీల్లేదనేదే తమ అంతిమ డిమాండ్ అని రామయ్య తేల్చిచెప్పారు. పెద్దిరెడ్డిని చేయాల్సిన విధంగా సెట్ చేశాకే, అతని మానసికస్థితి మెరుగయ్యాకే తిరిగిబయటకు విడిచిపెట్టాలన్నారు.

click me!