అవిశ్వాసం: రంగంలోకి వైసీపీ.. పార్లమెంటు ఆవరణలో ఆందోళన

First Published Jul 19, 2018, 12:21 PM IST
Highlights

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీలు, ఇతర నేతలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు.. విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు

కేంద్రప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ఇవ్వడంతో దేశరాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అవిశ్వాసాన్ని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై బీజేపీ.. కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీలు అవిశ్వాసానికి మద్దతు కూడగట్టేందుకు వివిధ పార్టీల అధినేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఇక కీలక సమయంలో పార్లమెంటులో అడుగుపెట్టే అవకాశం లేకపోయింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.. వైసీపీ కి చెందిన ఎంపీలు ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేకహోదా విషయంలో  కేంద్రం వైఖరిని నిరసిస్తూ రాజీనామా చేయడం.. దానికి స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించడం జరిగింది. దీంతో పోటీలో తాము వెనుకబడిపోతామని భావించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది.

దీనిలో భాగంగా ఆ పార్టీ మాజీ ఎంపీలు, ఇతర నేతలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు.. విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.. ఈ సందర్భంగా వైసీపీ నేత వరప్రసాద్  మాట్లాడుతూ.. ప్రత్యేకహోదాను ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి తాకట్టు పెట్టారని.. ఈ నాలుగేళ్లు చంద్రబాబు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.

click me!