రాజకీయ రంగు పులుముకుంటోన్న బాలిక ఆత్మహత్య: టీడీపీకి వ్యతిరేకంగా బెజవాడలో వైసీపీ నిరసన

By Siva Kodati  |  First Published Jan 30, 2022, 6:22 PM IST

విజయవాడలో బాలిక ఆత్మహత్యపై టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. స్థానిక కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్‌లో ఆందోళన నిర్వహించారు. టీడీపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. చిన్నారి మరణానికి వినోద్ జైన్ కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


విజయవాడలో బాలిక ఆత్మహత్యపై టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. స్థానిక కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్‌లో ఆందోళన నిర్వహించారు. టీడీపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. చిన్నారి మరణానికి వినోద్ జైన్ కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, కేశినేని నానిలతో వినోద్ జైన్ కలిసి వున్న ఫోటోలను వైసీపీ నేతలు ప్రదర్శించారు. 

మరోవైపు బాలిక ఆత్మహత్య ఘటనపై వైసీపీ (ysrcp) ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ రోజా (rk roja) ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలిక ఆత్మహత్యపై టీడీపీ (tdp) నేతలు ఏంచెబుతారని ఆమె నిలదీశారు. బాలిక బలవన్మరణానికి పాల్పడడం బాధాకరమని... స్త్రీలపై వేధింపులకు పాల్పడే టీడీపీ నేతలు నారీ సంకల్ప దీక్ష ఎలా చేస్తారని రోజా ప్రశ్నించారు. 60 ఏళ్ల వ్యక్తి బాలికను తండ్రిలా చూసుకోవాల్సింది పోయి, ఎలా వేధించాడో ఆ బాలిక పుస్తకంలో రాసుకున్న దాన్నిబట్టి అర్థమవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు పనులు చేసేది టీడీపీ నేతలే అని, దాన్ని ఇతరులపైకి నెడుతుంటారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Latest Videos

undefined

కాగా.. విజయవాడ నగరంలోని భవానిపురం కుమ్మరిపాలెం సెంటర్‌లో నివాసం ఉంటున్న బాలిక..  బెంజి సర్కిల్‌ వద్దగల ఒక పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. అయితే తనను ఓ యువకుడు గత కొన్ని రోజులు వేధిస్తున్నాడని నోట్ బుక్‎లో రాసి బాలిక అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. రక్తపు మడుగులో పడివున్న బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఆత్మహత్యకు పాల్పడక ముందు ముందు టెర్రస్‌పై 20 నిమిషాల పాటు బాలిక అటూ ఇటూ తిరుగుతూ సీసీ టీవీ కెమెరాల్లో కనిపించిందని పోలీసులు వెల్లడించారు. నిందితుడు వినోద్ జైన్ (vinod jain) ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 37వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేశాడు. గత రెండు నెలల నుంచి బాలికను వినోద్ జైన్ వేధిస్తున్నాడని… పలు సార్లు లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అతడి వేధింపులు తట్టుకోలేక బాలిక ఆత్మహత్య చేసుకుందని వారు చెప్తున్నారు. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 

click me!