ఎన్టీఆర్ జిల్లా : విహారయాత్రలో విషాదం... మున్నేరులో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి

Siva Kodati |  
Published : Nov 19, 2022, 07:50 PM IST
ఎన్టీఆర్ జిల్లా : విహారయాత్రలో విషాదం... మున్నేరులో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి

సారాంశం

విహారయాత్ర నిమిత్తం ఎన్టీఆర్ జిల్లా పెనుగ్రంచిపోలుకు వచ్చిన ఇద్దరు విద్యార్థులు మున్నేరులో పడి ప్రాణాలు కోల్పోయారు. మృతులను ఆరో తరగతి చదివే నర్సిరెడ్డి, నాలుగో తరగతి చదివే జశ్వంత్‌గా గుర్తించారు.    

ఎన్టీఆర్ జిల్లా పెనుగ్రంచిపోలు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మున్నేరులో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్ధులు మృతి చెందారు. మొత్తం నలుగురు విద్యార్ధులు ఈత కోసం మున్నేరులో దిగగా... ఇద్దరిని స్థానికులు కాపాడారు. మున్నేరు గుంటలో ఇద్దరు విద్యార్ధులు ఇరుక్కుపోయారు. జాలర్లు అతికష్టం మీద వీరిని బయటకు తీసినప్పటికీ ప్రాణాలు కోల్పోయారు. మధిర మండలం మడుపల్లిలోని సరస్వతి విద్యానికేతన్‌కు చెందిన విద్యార్ధులు గార్డెన్ పార్టీ కోసం పెనుగ్రంచిపోలుకు వచ్చారు. వీరిలో ఆరో తరగతి చదివే నర్సిరెడ్డి, నాలుగో తరగతి చదివే జశ్వంత్ మున్నేరులో దిగి ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Police Recruitment: కొలువుల జాతర.. 2050 పోలీస్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. నోటిఫికేషన్ ఫుల్ డిటైల్స్ ఇవే
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ముక్కోటి దేవతలకు ఆహ్వానం | Tirumala Srivari Brahmotsavam | Asianet