Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు

Published : May 13, 2025, 06:10 PM IST
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు

సారాంశం

Vallabhaneni Vamsi: తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై దాడి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైఎస్ఆర్సీపీ నాయకుడు వల్లభనేని వంశీ మోహన్ కు బెయిల్ మంజూరు అయింది.   

Vallabhaneni Vamsi: దళిత యువకుడు ఎం. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు (A1)గా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు బెయిల్ మంజూరు అయింది. విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వంశీతో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నలుగురు నిందితులకు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు న్యాయవర్గాలు తెలిపాయి.

వల్లభనేని వంశీ మోహన్ పై ఉన్న కేసు ఏంటి? 

2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి సమయంలో అక్కడ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ముదునూరి సత్యవర్ధన్ అనే దళిత యువకుడు ప్రధాన సాక్షిగా ఉన్నాడు. అయితే, ఆ దాడికి సంబంధించి వంశీ మోహన్ సత్యవర్ధన్‌ను బెదిరించి, కిడ్నాప్ చేసి, కోర్టులో తప్పుడు అఫిడవిట్ సమర్పించేట్లు ఒత్తిడి తీసుకొచ్చాడని ఆరోపణలు వచ్చాయి.

2025 ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో వల్లభనేని వంశీ మోహన్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం వంశీని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించి విజయవాడ జిల్లా జైలులో నిర్బంధించారు. 2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి జ‌రిగింది. అప్పట్లో టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న దళిత యువకుడు సత్యవర్ధన్‌ను వల్లభనేని వంశీ మోహన్ తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేసి, బెదిరించి, బలవంతంగా త‌న స్టేట్ మెంట్ ను మార్చుకునేలా చేశారని బాధితుడు ఫిర్యాదు చేశారు.

దర్యాప్తు అధికారులు పేర్కొన్న వివరాల ప్రకారం, ఫిబ్రవరి 13, 2025న వంశీని పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాప్ అనంతరం బాధితుడిని హైదరాబాద్ నుండి విశాఖపట్నం వరకు తరలించినట్లు దర్యాప్తులో తేలింది.

ఈ కేసుకు సంబంధించి మంత్రి కొల్లు రవీంద్ర విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజ్ కీలక మలుపు తిప్పింది. ఫిబ్రవరి 13 నాటి ఈ ఫుటేజ్‌లో సత్యవర్ధన్‌ను వంశీ అనుచరులు కారులో తీసుకెళ్తున్న దృశ్యాలు ఉన్నట్లు గుర్తించారు. ఇది కేసు నమోదు, విచారణలో ప్రధాన ఆధారంగా మారింది.

ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేశారు. వారిలో వెంకట శివరామ కృష్ణ (A7),నిమ్మల లక్ష్మీపతి (A8) ఉన్నారు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వల్లభనేని వంశీ మోహన్ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉండ‌గా, తాజాగా ఆయ‌న‌కు బెయిల్ మంజూరు అయింది.

PREV
Read more Articles on
click me!