నారా లోకేశ్‌తో యామినికి లింకేంటి: వైసీపీ నేత సుధాకర్ బాబు

Siva Kodati |  
Published : May 02, 2019, 06:38 PM IST
నారా లోకేశ్‌తో యామినికి లింకేంటి: వైసీపీ నేత సుధాకర్ బాబు

సారాంశం

టీడీపీ నేత, మంత్రి నారాలోకేశ్‌కి ఆ పార్టీ అధికార ప్రతినిధి యామినీ సాధినేనికి మధ్య సంబంధం ఏంటని ప్రశ్నించారు వైసీపీ నేత సుధాకర్ బాబు. 

టీడీపీ నేత, మంత్రి నారాలోకేశ్‌కి ఆ పార్టీ అధికార ప్రతినిధి యామినీ సాధినేనికి మధ్య సంబంధం ఏంటని ప్రశ్నించారు వైసీపీ నేత సుధాకర్ బాబు.

గురువారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన... తమ పార్టీ నేత విజయసాయిరెడ్డి చాలా స్పష్టంగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సింది పోయి తాబేదార్లతో తాళాలు మోగిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

సెలెక్టెడ్ ఆర్టిస్టులతో టీడీపీ ఆఫీసులో ఇష్టానురీతిలో మాట్లాడిస్తున్నారని సుధాకర్ మండిపడ్డారు. ఐటీ గ్రిడ్స్ అశోక్  విషయంలో నారా లోకేశ్ ఎందుకు నోరు విప్పడం లేదని నిలదీశారు. అసలు యామినికి, లోకేశ్‌‌కు మధ్య లింకేంటి.. ఆయనను ప్రశ్నిస్తే, ఆమె ఎందుకు స్పందిస్తోందని ప్రశ్నించారు.

యామిని ఎందుకు అంతలా పెట్రేగిపోతోందని... అర్ధం లేకుండా మాట్లాడుతోందని సుధాకర్ దుయ్యబట్టారు. చంద్రబాబు దాష్టికాలకు మరో 20 రోజుల్లో అంతం జరగబోతోందన్నారు. లోకేశ్ కోసం యామిని, యనమల కోసం కుటుంబరావు మీడియా ముందుకొస్తున్నారని మరి చంద్రబాబు కోసం ఎవరు వస్తారని సుధాకర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

దేవినేని ఉమాకు సిగ్గుందా.. ఆల్మట్టి ప్రాజెక్ట్ నిర్మాణం ఎందుకు ఆపలేకపోయారని నోరు అదుపులో పెట్టుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు కల్లు తాగిన కోతుల్లా దిగజారి మాట్లాడుతున్నారని సుధాకర్ మండిపడ్డారు. 
 

PREV
click me!

Recommended Stories

RK Roja Celebrate Kanuma GoPuja: కనుమ సందర్బంగాగోపూజ నిర్వహించిన ఆర్కె రోజా| Asianet News Telugu
Kethireddy Pedda Reddy Pressmeet: ఎక్క‌డైనా చర్చకు సిద్ధం జేసీకి పెద్దారెడ్డి స‌వాల్| Asianet Telugu