పెద్దవాడు అయ్యాడు... కొడుకుపై లోకేష్ ట్వీట్.. నెటిజన్ల ట్రోల్స్

Published : May 02, 2019, 03:40 PM IST
పెద్దవాడు అయ్యాడు... కొడుకుపై లోకేష్ ట్వీట్.. నెటిజన్ల ట్రోల్స్

సారాంశం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు, ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తమ పార్టీ నేతలు ప్రజలకోసం చేస్తున్న మంచి పనులను ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో లోకేష్ షేర్ చేస్తూ ఉంటారు. 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు, ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తమ పార్టీ నేతలు ప్రజలకోసం చేస్తున్న మంచి పనులను ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో లోకేష్ షేర్ చేస్తూ ఉంటారు. అంతేకాదు.. ప్రతిపక్ష నేతలు చేసే ఆరోపణలకు కూడా లోకేష్ ట్విట్టర్ వేదికగా సమాధానం చెబుతూ ఉంటారు.

కాగా.. తాజాగా లోకేష్ తన కొడుకు దేవాన్ష్ తో దిగిన ఫోటోలను ఎంతో ఆనందంగా ట్విట్టర్ లో పోస్టు  చేశారు. దేవాన్ష్‌ చాలా త్వరగా పెద్దవాడు అయిపోతున్నాడని, అతనితో ఎక్కువ సమయం గడపలేకపోతున్నానంటూ గురువారం ట్విటర్‌లో నారాలోకేశ్‌ పోస్ట్‌ పెట్టారు. దేవాన్ష్‌తో గడిపిన మధుర క్షణాలు, ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొంటూ కొన్ని ఫోటోలను పోస్ట్‌ చేశారు. 

కాగా.. ఆ ఫోటోల్లో దేవాన్ష్ చాలా ముద్దుగా... అందరికీ నచ్చేవిధంగా ఉన్నాడు. ఆ ఫోటోలను చూసి టీడీపీ అభిమానులు మురిసిపోతుంటే... యాంటీ ఫ్యాన్స్ మాత్రం రెచ్చిపోతున్నారు.  లోకేష్ తన కొడుకు గురించి రాసిన పోస్టులో దేవాన్ష్ ని కూడా ట్యాగ్ చేశారు. దీనిపై కొందరు నెటిజన్లు లోకేష్ పై మండిపడుతున్నారు.

నాలుగేళ్ల పిల్లాడికి స్పెషల్ గా ట్విట్టర్ ఎకౌంటా అని ప్రశ్నిస్తున్నారు. ట్విట్టర్ లో ఎకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే కనీసం 13 సంవత్సరల వయసు ఉండాలి. అది కూడా తెలీకుండా లోకేష్... ఐటీ మినిష్టర్ అయ్యారంటూ విమర్శలు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా జగన్ రాడు | JC Prabhakar Reddy Comments | Asianet News Telugu
Gade Sai Krishna Case: నేనెలాంటి సెటిల్మెంట్లు చేయలేదు | Janasena leader Ammisetty Vasu | Asianet