వైఎస్ విజయమ్మ ఆత్మీయ సమావేశంపై సజ్జల స్పందన ఇదీ....

By Siva KodatiFirst Published Sep 1, 2021, 5:48 PM IST
Highlights

పెన్షన్లపై వృద్ధుల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ హయాంలో పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలిసేది కాదని.. తాము అధికారంలోకి వచ్చాక ప్రతీ నెలా ఒకటో తేదీనే పెన్షన్లు ఇస్తున్నామని సజ్జల గుర్తుచేశారు. 

వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులను విజయమ్మ కలవడంలో తప్పేమీ లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. రేపు సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్ విజయమ్మ హైదరాబాదులో వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దానిపై సజ్జల రామకృష్ణా రెడ్డి బుధవారం మీడియా సమావేశంలో స్పందించారు. 

పెన్షన్లపై వృద్ధుల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెన్షన్లు తగ్గిస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలిసేది కాదని.. తాము అధికారంలోకి వచ్చాక ప్రతీ నెలా ఒకటో తేదీనే పెన్షన్లు ఇస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు వృద్ధులు గుర్తొచ్చేవారని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు హడావిడిగా చంద్రబాబు పెన్షన్లు పెంచారని సజ్జల దుయ్యబట్టారు. ఎల్లో మీడియా అసత్యాలు రాయడమే పనిగా పెట్టుకుందని సజ్జల మండిపడ్డారు. 

గతంలో పింఛను ఏ రోజు వస్తుందో తెలిసేది కాదని ఆయన అన్నారు. గతంలో గంటల తరబడి క్యూలైన్లో నిలబడి పింఛన్లు తీసుకునేవారని ఆయన చెప్పారు. అనర్హులకు కూడా పింఛన్లు ఇవ్వమంటారా అని ఆయన ప్రశ్నించారు. కొందరు ఇతర రాష్ట్రాల్లో ఉండి ఇక్కడ పింఛన్లు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. రెండు మూడు నెలలకు ఓసారి వచ్చి పింఛను తీసుకోవడం వల్ల అర్హులు ఎవరో, అనర్హులు ఎవరో తెలియడం లేదని ాయన అన్నారు. 

మూడు నెలలకు ఓసారి పింఛను ఇస్తే అవినీతికి ఆస్కారం ఉంటుందని, ఇతర రాష్ట్రాల్లో ఉంటూ రెండు మూడు నెలలకు ఓసారి వచ్చి పింఛన్లు తీసుుకనేవారికి ఒకేసారి పింఛన్లు ఇవ్వరని ఆయన స్పష్టం చేశారు. పింఛన్లలో పొరపాట్లను సరిచేయడానికి నూతన విధానం అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తప్పులను సరిదిద్దుకునేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన చెప్పారు. 

చంద్రబాబు నిర్వాకం వల్లనే విద్యుత్తు సవరణ బకాయిల భారం వినియోగదారులపై పడుతోందని ఆయన అన్నారు. చంద్రబాబు హయాంలో అడ్డగోలుగా ఎక్కువ రేటుకు విద్యుత్తు కొనుగోలు చేయడం వల్లనే విద్యుత్తు బకాయిల భారం పడుతోందని ఆయన అన్నారు. ఉన్న అప్పులకు ప్రస్తుతం ఏడాదికి 30 వేల కోట్ల వరకు వడ్డీలుగా రాష్ట్రం ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోందని ఆయన అన్నారు. 

జగన్ గాలో గడ్డపారో గత ఎన్నికల్లో జనమే తేల్చారని, గత ఎన్నికల్లో జనమే జగన్ ను గడ్డపారలా తయారు చేసి చంద్రబాబును పెకిలించారని ఆయన అన్నారు. త్వరలో జగన్ రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, ఇంకా తేదీ ఖరారు కాలేదని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.

click me!