భారీగా తగ్గిన మరణాలు: ఏపీలో కొత్తగా 1186 మందికి పాజిటివ్.. చిత్తూరు, తూ.గోలో తీవ్రత

Siva Kodati |  
Published : Sep 01, 2021, 04:45 PM IST
భారీగా తగ్గిన మరణాలు: ఏపీలో కొత్తగా 1186 మందికి పాజిటివ్.. చిత్తూరు, తూ.గోలో తీవ్రత

సారాంశం

ఏపీలో కొత్తగా 1186 కరోనా కేసులు నమోదవ్వగా.. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1,396 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 14473 మంది చికిత్స పొందుతున్నారు.


ఆంధ్రప్రదేశ్‌‌‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1186 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,12,407కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,867కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల చిత్తూరులో 1, తూర్పుగోదావరి 1, కృష్ణ 4, నెల్లూరు 2, ప్రకాశం 1, విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 1,396 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 19,84,067కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 56,155 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,66,85,469కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 14,473 మంది చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజు అనంతపురం 40, చిత్తూరు 171, తూర్పుగోదావరి 175, గుంటూరు 111, కడప 87, కృష్ణ 103, కర్నూలు 13, నెల్లూరు 156, ప్రకాశం 125, శ్రీకాకుళం 50, విశాఖపట్నం 69, విజయనగరం 13, పశ్చిమ గోదావరిలలో 73 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: రైతుల‌కు శుభ‌వార్త‌.. రూ.50 వేల వడ్డీలేని రుణం.. పూర్తి వివ‌రాలు
ఆంధ్రప్రదేశ్-ఆస్ట్రేలియాల మధ్య కీలక ఒప్పందాలు.. దీంతో ఏపీ ప్రజలకు జరిగే లాభం ఏంటంటే.?