ఎందరు హెచ్చరించినా బాబు ఖాతరు చేయలేదు.. ఎస్ఈసీ వల్లే ఆర్డినెన్స్: సజ్జల వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Mar 26, 2021, 03:24 PM IST
ఎందరు హెచ్చరించినా బాబు ఖాతరు చేయలేదు.. ఎస్ఈసీ వల్లే ఆర్డినెన్స్: సజ్జల వ్యాఖ్యలు

సారాంశం

టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అసైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబు దళితులకు అన్యాయం చేశారని ఆరోపించారు.

టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అసైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబు దళితులకు అన్యాయం చేశారని ఆరోపించారు.

టీడీపీ హాయాంలో చంద్రబాబు బినామీలు కారుచౌకగా భూములు కొట్టేశారని సజ్జల ఎద్దేవా చేశారు. భూములు దోచుకునేందుకే రాజధాని పేరుతో చంద్రబాబు స్కామ్‌కు పాల్పడ్డారని సజ్జల ఆరోపించారు.

అసైన్డ్ భూములపై జీవో 41 జారీ చేస్తే ఇబ్బందులు వస్తాయని అప్పట్లోనే లా సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, సీఆర్‌డీఏ కమీషనర్ హెచ్చరించినా చంద్రబాబు పట్టించుకోలేదని రామకృష్ణారెడ్డి అన్నారు.

ప్రలోభపెట్టి, బెదిరించి ప్రభుత్వం కేసులు పెట్టించిందని టీడీపీ తప్పుడు ఆరోపణలు చేసిందని ఆయన మండిపడ్డారు. పేదలపై జరిగిన దాడిని తొక్కేయడానికి వ్యక్తులను కాపాడేందుకే స్టింగ్ ఆపరేషన్‌ చేశారని, అలాగే బినామీలకు లబ్ధి చేకూర్చేందుకే జీవో 41 తెచ్చారని సజ్జల ఆరోపించారు.

బాబు ఏ తప్పూ చేయకుంటే సీఐడీ ముందుకు రావడానికి అభ్యంతరమేంటని ఆయన ప్రశ్నించారు. అసైన్డ్ భూములే కాదు... లంక భూముల కుంభకోణం కూడా వుందని సజ్జల ఆరోపించారు.

నాడు భయపెట్టి, బెదిరించి భూములను లాక్కున్నారని పేదలకు ఇళ్ల కోసం అసైన్డ్ భూములను తీసుకుంటే దానితో పోలిక పెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. మేం ఇచ్చిన జీవోకు, టీడీపీ జీవోకు పోలికే లేదన్నారు.

పేదలకు న్యాయం చేసేందుకే తాము జీవో ఇచ్చామని... పేదలకు అన్యాయం చేసేందుకు టీడీపీ జీవో ఇచ్చిందని సజ్జల తెలిపారు. బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ చేశామని.. ఎస్ఈసీ తలాతోక నిర్ణయాలతో ఆర్డినెన్స్ జారీ చేయాల్సిన పరిస్ధితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బడ్జెట్‌ని దాచిపెట్టే పరిస్ధితి వుండదని.. తిరుపతి లోక్‌సభ, పరిషత్ ఎన్నికలున్నాయని సజ్జల చెప్పారు. అంతా ఎన్నికల హడావిడిలో వున్నారని.. ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని తప్పుపట్టడం కోడి గుడ్డుపై ఈకలు పీకడమేనని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: అధికారులకు చంద్రబాబు హెచ్చరిక | Asianet News Telugu
CM Chandrababu Naidu: చరిత్రలో నిలిచిపోయే రోజు సీఎం చంద్రబాబు| Asianet News Telugu