పోలీసుల కళ్లుగప్పి ఏపీ డీజీపీ కార్యాలయానికి ఎమ్మెల్సీ మాధవ్, ఆదినారాయణరెడ్డి: అరెస్ట్

By narsimha lode  |  First Published Jan 21, 2021, 1:19 PM IST

పోలీసుల కళ్లుగప్పి ఏపీ డీజీపీ కార్యాలయ సమీపంలోకి బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి చేరుకొన్నారు. చివరి నిమిషంలో వారిని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. 


గుంటూరు: పోలీసుల కళ్లుగప్పి ఏపీ డీజీపీ కార్యాలయ సమీపంలోకి బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి చేరుకొన్నారు. చివరి నిమిషంలో వారిని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఏపీ రాష్ట్రంలో దేవాలయాలపై దాడుల్లో బీజేపీ నేతల ప్రమేయం ఉందని  డీజీపీ వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఏపీ రాష్ట్ర కమిటీ  ఇవాళ డీజీపీ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చింది.దేవాలయాలపై దాడుల కేసుల్లో బీజేపీ నేతల ప్రమేయం ఉందని డీజీపీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు చేసిన డీజీపీ క్షమాపణలు చెప్పాలని కోరింది.

Latest Videos

రాష్ట్ర వ్యాప్తంగా పలువురు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.పోలీసుల కళ్లుగప్పి మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం వద్దకు చేరుకొన్న ఎమ్మెల్సీ మాధవ్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి చేరుకొన్నారు. పోలీస్ కంచెను దాటుకొని వీరిద్దరూ మరికొందరు కార్యకర్తలతో కలిసి డీజీపీ కార్యాలయం వద్దకు చేరుకొన్నారు.  వారిని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు.

రాష్ట్రంలోని పలు దేవాలయాలపై దాడులతో పాటు పలువురు దేవతా విగ్రహాలు ధ్వంసమయ్యాయి.ఈ దాడులు రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలకు కారణమయ్యాయి. 

click me!