కరోనాపై చంద్రబాబు విషప్రచారం దేశద్రోహమే: సజ్జల రామకృష్ణారెడ్డి

By narsimha lode  |  First Published May 10, 2021, 3:50 PM IST

కరోనాపై చంద్రబాబు చేస్తున్న విష ప్రచారం దేశ ద్రోహం, రాజద్రోహం కిందకు వస్తోందని ఏపీ రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.


అమరావతి: కరోనాపై చంద్రబాబు చేస్తున్న విష ప్రచారం దేశ ద్రోహం, రాజద్రోహం కిందకు వస్తోందని ఏపీ రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.సోమవారం నాడు  అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కష్టసమయంలోనూ చంద్రబాబునాయుడు నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. కరోనా వ్యాక్సిన్లు కొనడం లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వ్యాక్సినేషన్ పై చంద్రబాబునాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వ్యాక్సిన్ పై కేంద్ర టాస్క్‌ఫోర్స్ మానిటరింగ్ చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో కేంద్రం ఇదే విషయాన్ని స్పష్టం చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కరోనాను  ఆరోగ్యశ్రీలో చేర్చామన్నారు. అబద్దాలు ప్రచారం చేసే వారిపై ఏ శిక్ష విధించాలో ప్రజలే నిర్ణయిస్తారని ఆయన చెప్పారు. కరోనాపై  సీఎం జగన్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.

Latest Videos

ప్రస్తుతం 45 ఏళ్ల వారికి సెకండ్ డోస్ వేసే ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఏ రాష్ట్రానికి లేని వ్యాక్సిన్లు వేసే కెపాసిటీ ఏపీకి ఉందని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబునాయుడు ఎక్కడ వ్యాక్సిన్ వేసుకొన్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు వ్యాఖ్యల్లో మొత్తం ఉన్మాదం, కుట్ర రాజకీయం దాగి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబునాయుడు చేస్తున్న విషప్రచారంపై ఎక్కడికక్కడ కేసులు పెట్టాలని ఆయన కోరారు. 


 

click me!