రాత్రి ఒక పార్టీతో.. పగలు మరో పార్టీతో చెట్టాపట్టాలు : పవన్‌ కళ్యాణ్‌పై సజ్జల సెటైర్లు

Siva Kodati |  
Published : Apr 06, 2021, 03:38 PM ISTUpdated : Apr 06, 2021, 03:39 PM IST
రాత్రి ఒక పార్టీతో.. పగలు మరో పార్టీతో చెట్టాపట్టాలు : పవన్‌ కళ్యాణ్‌పై సజ్జల సెటైర్లు

సారాంశం

పవన్‌కు సొంత అభిప్రాయమంటూ ఏమీ లేదంటూ ఎద్దేవా చేశారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాడేపల్లిలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన పవన్ ఒక రాత్రి ఒక పార్టీలో పగలు ఇంకో పార్టీతో తిరుగుతున్నారంటూ ఆరోపించారు

పవన్‌కు సొంత అభిప్రాయమంటూ ఏమీ లేదంటూ ఎద్దేవా చేశారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాడేపల్లిలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన పవన్ ఒక రాత్రి ఒక పార్టీలో పగలు ఇంకో పార్టీతో తిరుగుతున్నారంటూ ఆరోపించారు.

పవన్ కల్యాణ్‌కు ఆవేశం తప్ప ఆలోచన లేదని.. సినిమా డైలాగులు స్టేజీల మీద చెబుతున్నారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. వైసీసీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఎన్నికలు వస్తే చంద్రబాబు ఊతకర్రల సాయంతో గట్టెక్కారు తప్పించి సొంతంగా ఎప్పుడూ గెలవలేదని సజ్జల ఎద్దేవా చేశారు. టీడీపీ-కాంగ్రెస్ కలిసి జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించాయని.. ఈ విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ నేతలే చెప్పారని రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు.

జగన్‌ బెయిల్ ఏ క్షణమైనా రద్దవ్వొచ్చని ఢిల్లీ నుంచి వచ్చిన ఒకాయన చెబుతున్నారని.. అంటే కోర్టులను కేంద్రం నియంత్రిస్తుందా అంటూ సజ్జల నిలదీశారు. బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని ఆయన ఆరోపించారు.

జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక తెర వెనుక రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిపోయారని.. ఆర్ధిక పరిస్ధితి సరిగా లేకున్నా హామీలన్ని నెరవేరుస్తున్నామని సజ్జల వెల్లడించారు.

సీఎం జగన్ సంక్షేమ పాలనకు నిదర్శనమే స్థానిక సంస్థల ఫలితాలు అని ఆయన గుర్తుచేశారు. జగన్‌పై తప్పుడు కేసులు పెట్టిన వారికి జనం తగిన బుద్ధి చెప్పారని సజ్జల వివరించారు. తిరుపతి ఉప ఎన్నికలో కూడా భారీ మెజారిటీతో గెలుస్తామని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Chairman: మిమ్మల్ని ఏమైనా అంటే..! కోపాలు తాపాలు... చేసేవి పాపాలు | Asianet Telugu
Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు