జగనన్నకు అండగా ఉండండి, కానుక ఇవ్వండి.. వీడియోరిలీజ్ చేసిన రోజా...

Published : Apr 06, 2021, 03:19 PM IST
జగనన్నకు అండగా ఉండండి, కానుక ఇవ్వండి.. వీడియోరిలీజ్ చేసిన రోజా...

సారాంశం

ఇంకో నెల రోజులు విశ్రాంతి అవసరమని ఏపీఐఐసీ చైర్పర్సన్ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఒక వీడియో విడుదల చేశారు. రోజాకు ఇటీవల రెండు మేజర్ ఆపరేషన్లు జరిగిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ల తరువాత మొదటి సారిగా ఆమె ఇలా వీడియో విడుదల చేశారు. 

తాను బాగానే ఉన్నానని, ఆపరేషన్ల కారణంగా మరో నెలరోజుల పాటు విశ్రాంతి అవసరం అన్నారని చెప్పుకొచ్చారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న జగనన్నకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.  

ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి సీఎం జగన్ కు కానుకగా ఇవ్వాలన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోతుందని రోజా పేర్కొన్నారు.

రెండు మేజర్ సర్జరీలు చేసుకుని చెన్నై మలర్ ఆస్పత్రిలో చికిత్స పొందిన రోజా గత శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఆమె భర్త ఆర్.కె.సెల్వమణి, కుమార్తె అన్షుమాలిక, కుమారుడు కృష్ణకౌశిక్, కుటుంబ సభ్యులు ఆమెను చెన్నైలోని వారి స్వగృహానికి తీసుకెళ్లారు

పూర్తిగా ఆరోగ్యం పూర్తిగా కుదుట పడేవరకూ ఆమె చెన్నై ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటారని ఆర్.కె.సెల్వమణి తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Gudivada Amarnath Pressmeet: కూటమి ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్‌ పంచ్ లు| Asianet News Telugu
CM Chandrababu Naidu: అధికారం దుర్వినియోగం చేసేవారిపై బాబు సీరియస్| Asianet News Telugu