ఏపీలో 19 వేల పైచిలుకు కేసులు.. లాక్‌డౌన్‌పై సజ్జల సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published May 1, 2021, 7:01 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ చాలా ప్రమాదకరంగా ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. శనివారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన లాక్‌డౌన్‌ పెడితే రాష్ట్రం మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ చాలా ప్రమాదకరంగా ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. శనివారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన లాక్‌డౌన్‌ పెడితే రాష్ట్రం మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రజలు వ్యాక్సిన్‌ వేయించుకున్నా.. కోవిడ్ నిబంధనలు పాటించాలని సజ్జల సూచించారు. కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రతిరోజు సమీక్షలు నిర్వహిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

Also Read:ఏపీలో కరోనాతో 8 మంది విద్యుత్ ఉద్యోగులు మృతి... !

ప్రజల ఆకాంక్షల మేరకు జగన్‌ పాలన చేస్తున్నారని.. ఆర్థిక సంక్షోభంలోనూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని ఆయన ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా జగన్‌ పాలన ఉందని... తమ పాలనపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని సజ్జల ధీమా వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి తీసుకునే ప్రతి నిర్ణయం బాధ్యతాయుతంగా ఉంటుందని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షనేత చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో కూర్చుని ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని.. సంక్షోభ సమయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని సజ్జల హితవు పలికారు

click me!